తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 ముగింపు దశకు వచ్చింది.ఈ వారం ఇంట్లో ఏడుగురు ఉండగా, ఏడుగురు కూడా ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు.
ప్రస్తుతం వస్తున్న ఓట్ల ఆధారంగా చూసుకున్నట్లయితే బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తేలిపోతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.ఇంటి సభ్యులు అంతా కూడా నామినేషన్స్‌లో ఉన్నారు కనుక ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే ఫైనల్ విన్నర్‌గా కూడా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వారంలో ఎలిమినేషన్‌లో ఉన్న వారి ఓట్లను పరిశీలించినట్లయితే అత్యధికంగా రాహుల్‌కు ఓట్లు పడుతున్నట్లుగా తెలుస్తోంది.ఆయన జెన్యూన్‌గా ఆడుతూ తన పని తాను చేసుకుంటూ నాటకాలు ఆడకుండా ఆకట్టుకుంటున్నాడు అంటూ అంతా అనుకుంటున్నారు.అతడు బోల్డ్‌గా తాను ఒక బార్బర్‌ను అని, డబ్బు గెలిస్తే బార్బర్ షాప్ పెట్టుకుంటానంటూ సింపుల్‌గా చెప్పిన మాటలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అందుకే రాహుల్‌కు అత్యధికంగా ఓట్లు పడుతున్నాయి.ఆ కమ్యూనిటీ వారు మొత్తం కూడా రాహుల్‌కు ఓట్లు గుద్దేస్తున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది.ఈ సమయంలోనే శ్రీముఖి ఆ తర్వాత స్థానంలో నిలిచింది.