సోషల్ మీడియాలో ఈమద్య చాలా మంది సెలబ్రెటీలు అవుతున్నారు.జానీ దాదా అనే వ్యక్తి టిక్‌టాక్ విలన్‌గా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.
తన వీడియోలతో విపరీతమైన ఫాలోయింగ్‌ను దక్కించుకున్న జానీ దాదా ఇటీవల తన లవర్ నికితా శర్మను హత్య చేశాడు.తనను కాకుండా మరో వ్యక్తిని నికితా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతుంది.
అందుకే ఆమెను చంపేశాడని సమాచారం అందుతోంది.పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్థారించారు.
పోలీసు విచారణలో ఆసక్తికర విషయాలు వెళ్లడయ్యాయి.జానీ దాదా చాలా కాలంగా నికితా శర్మను ప్రేమిస్తున్నాడు.ఇద్దరు కూడా చాలా క్లోజ్ అయ్యారు.ఆమె దుబాయి ప్లైట్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తుంది.
ఇద్దరి ప్రేమకు సంబంధించిన వీడియోలను జానీ చాలా పెట్టాడు.ఆమె పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత తన లవ్ ఫెయిల్యూర్‌కు సంబంధించిన వీడియోలు కూడా చాలానే పెట్టాడు.
అయితే ఇతడు మరీ ఇంత దారుణంకు పాల్పడుతాడని ఎవరు అనుకోలేదు.

అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ అంటే జానీ దాదాకు విపరీతమైన ఇష్టం.ఆ ఇష్టంతోనే ఆ సినిమాలోని డైలాగ్స్ చాలా వీడియోలు చేశాడు.ఇక ఆ సినిమాలోని నాకు దక్కనిది మరెవ్వరికి దక్కకూడదు అంటూ వచ్చే డైలాగ్‌ను ఆధారంగా చేసుకుని తన లవర్ తనకు కాకుండా మరెవ్వరికి దక్కవద్దని నికితను చంపేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
జానీ దాదా కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.కబీర్ సింగ్ సినిమాను అభిమానించే వ్యక్తి ఇలా హత్య చేయడం పట్ల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాడు.