నవంబర్ 8 న ఏమి జరిగిందో అందరికి తెలిసిందే.అప్పటివరకు పెద్ద నోట్లుగా చలామణి అవుతున్న వెయ్యి,ఐదువందల రూపాయల నోట్లను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీని స్థానంలో కొత్తగా 2000 రూపాయల నోటును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.అన్నట్లు గానే ఆ రెండువేల రూపాయల నోటును అందరికీ అందించారు.
అయితే 2016 నుంచి ఈ రెండు వేల నోటును ప్రింట్ చేస్తూ వచ్చిన ఆర్బీఐ ఇప్పుడు ఈ ఆర్ధిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ప్రింట్ చేయకపోవడం విశేషం.

దీనితో ఈ నోటు ను బ్యాన్ చేస్తున్నారు అన్న అనుమానాలు వస్తున్నాయి.అయితే దీనిపై ఆర్బీఐ మాట్లాడుతూ అలాంటిది ఏమీ లేదని రెండు వేల రూపాయల నోటును బ్యాన్ చేయకుండా ప్రస్తుతం ఆ నోటు ప్రింటింగ్ ను మాత్రమే ఆపేసినట్లు స్పష్టం చేసింది.2016 నుంచి ఈ నోటు ను ప్రింట్ చేస్తూ వచ్చి ఆర్బీఐ ప్రతి ఆర్ధిక సంవత్సరంలో ఈ నోటు ప్రింటింగ్ ను తగ్గించుకుంటూ వచ్చింది.అయితే ఈ ఆర్ధిక సంవత్సరంలో ఒక్కనోటు కూడా ప్రింట్ కాలేదు.అయితే పెద్ద నోట్లు బ్యాన్ చేసిన సమయంలో ఈ రెండువేల నోటు కొద్దీ కాలం పాటె చలామణి లో ఉంటుంది అన్నట్లు అప్పట్లో వార్తలు రావడం తో ఆ వార్తలకు ఇప్పుడు ఏర్పడ్డ పరిస్థితికి అనువయించుకున్న ప్రజలు నిజంగానే ఈ రెండువేల నోటును బ్యాన్ చేస్తున్నారేమో అన్న అనుమానాలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఈ విధంగా ఆర్బీఐ ఈ నోట్ల ప్రింటింగ్ కూడా ఆపివేయడం తో ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది.అయితే మరోపక్క విశ్లేషించుకుంటే ఈ నోట్ల ప్రింటింగ్ ఆపేయడానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నట్లు అర్ధం అవుతుంది.
అదే పొరుగుదేశం అయిన పాకిస్థాన్ ఈ రెండువేల రూపాయల నకిలీ నోటును తయారు చేసి చలామణిలో చేస్తుండడం కూడా ఒక కారణంగా తెలుస్తుంది.గత మూడేళ్ళ వ్యవధిలో దాదాపు 50 కోట్ల మేరకు నకిలీ నోట్ల ను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.
మరి ఈ కారణాల రీత్యా ఈ రెండు వేల నోటు ను ప్రింటింగ్ ఆర్బీఐ నిలిపివేసిందా లేదా మరేదైనా కారణం ఉందా అన్నది మాత్రం తెలియరావడంలేదు.ఒకవేళ ఈ నోటు కూడా బ్యాన్ అయితే జనాల పరిస్థితి ఏంటి అనేది అర్ధంకావడం లేదు.