టాలీవుడ్ ప్రేక్షకులకు తన పాటలతో మత్తెక్కించే మంగ్లీ( Singer Mangli ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.రేలా……రేలా….రే.పాటతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ తెలంగాణ గాణ కోయిల ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు సైతం తన స్వరాన్ని అందిస్తుంది.ఇప్పుడు టాలీవుడ్ లో తన పాటలకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.మంగ్లీ తన పాటలకు ఎంతో పేరు సంపాదించుకుంది.2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్న మంగ్లీ అనంతపురం జిల్లాలోని ఒక పేద బంజారా కుటుంబంలో జన్మించింది.ఈమె అసలు పేరు సత్యవతి.
తండ్రి పనిచేస్తేనే కుటుంబ పోషణ జరిగేది.ఈమెను చదివించడం కూడా చాలా కష్టంగా మారింది.
చిన్నప్పటినుండే పాటలు పాడమంటే ఎంతో ఇష్టం.
పదవ తరగతి వరకు ఏదోలాగా చదివించారు తల్లిదండ్రులు.పై చదువులు చదివించాలని ఆశ ఉన్న ఆర్థిక స్తోమత అడ్డుపడింది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్( Rural Development Trust ) వారి సలహాతో, ఆర్థిక సహకారంతో తిరుపతిలో కర్ణాటక సంగీతంలో జాయిన్ అయింది.
ఈ ట్రస్టు సహకారంతోనే ఎస్ వి విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లమా కోర్సులో చేరింది.తరువాత తన సీనియర్స్ సలహాతో గచ్చిబౌలిలో చిన్న పిల్లలకు సంగీత టీచర్ గా పాఠాలు చెప్పేది.
ఆ తర్వాత మంగ్లీ తీన్మార్ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. భిక్షు నాయక్ అనే జానపద గాయకుడు ద్వారా వి6 ఛానల్ లో ప్రసారమైన జానపద కార్యక్రమంలో పాల్గొంది.
ఆ తర్వాత ఆ ఛానల్ వాళ్ళే యాంకర్ గా అవకాశం ఇచ్చారు.
పేరును కాస్త మార్చుకోమని సలహా ఇస్తే తన తాతమ్మ పేరు మంగ్లీని తన పేరుగా మార్చుకుంది.ఆ పేరు తోనే మాటకారి మంగ్లీ అనే కార్యక్రమం మొదలైంది.తర్వాత ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది.
ఆ తరువాత తెలంగాణ ఆవిర్భవ సందర్భంగా పాడిన రేలా… రేలా…రే అనే పాట మంగ్లీని సెలబ్రిటీ సింగర్ గా మార్చింది.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఎన్నో పాటలు పాడి ప్రేక్షకుల ఆదరణ పొందింది.కేవలం జానపద పాటలే కాకుండా, సినిమా పాటలు, ప్రైవేట్ సాంగ్స్, భక్తి పాటలు, పండగ పాటలు పాడి తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.ఇక ఏ రోజు కూడా తను అందాలు ఆరబోసినట్లు కనిపించలేదు.అంతేకాకుండా స్టైలిష్ గా కూడా కనిపించలేదు.కానీ రీసెంట్గా తనలో కాస్త మార్పు వచ్చినట్లు కనిపించింది.
ఎన్నడు కనిపించిన విధంగా సరికొత్త అవతారంలో కనిపించింది.ట్రెండీగా ఉన్న వెస్ట్రన్ డ్రెస్( Western dress ) లో కనిపించింది.
దీంతో ఆ ఫోటో చూసి జనాలు ఆమెపై ఫైర్ అవుతున్నారు.నువ్వు కూడా మొదలు పెట్టావా.
ఇక ఇప్పుడు ఇలాగే రెడీ అవుతూ రాను రాను అందాలు కూడా ఆరబోస్తావు కదా అని కామెంట్లు చేస్తున్నారు.మరి కొంతమంది మాత్రం దయచేసి మీరు మారకండి.
కొత్తదారి అసలు పట్టకండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు.