సింగర్ కల్పన విషాదకరమైన జీవితం గురించి మీకు తెలుసా..?

ప్రముఖ భారతీయ నేపథ్యగాయని కల్పన తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలను పాడి సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.1000 కోయిలలు గొంతు కలిపితే ఎంత మధురంగా ఉంటుందో కల్పన గాత్రం కూడా అంతే మధురంగా ఉంటుంది.సంగీతంపై అమితమైన మక్కువతో కల్పన తన 5 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు.శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, పాశ్చాత్య సంగీతం ఇలా ఏ జోనర్ లోనైనా అవలీలగా పాటలు పాడగల కల్పన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

 Singer Kalpana Unknown Personal Life Details-TeluguStop.com

ఎంత క్లిష్టమైన పాట ఇచ్చినా వెంటనే పాడగల ఆమెను రాక్షసి అని ముద్దుగా పిలుస్తుంటారు.

కల్పన టి.ఎస్ రాఘవేంద్ర, సులోచన దంపతులకు 1980 మే 8న చెన్నై లో జన్మించారు.కల్పన తండ్రి రాఘవేంద్ర ప్రముఖ సింగర్, యాక్టర్, కంపోజర్ కాగా.

 Singer Kalpana Unknown Personal Life Details-సింగర్ కల్పన విషాదకరమైన జీవితం గురించి మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమె తల్లి సులోచన పాటలు పాడేవారు.కర్ణాటక సంగీతాన్ని మధురై టీ.శ్రీనివాస్ వద్ద నేర్చుకున్న కల్పన 1991 లో సినిమా పాటలు పాడటం ప్రారంభించారు.మొదట్లో తమిళ పాటలు పాడిన ఆమె ఆ తర్వాత తెలుగు పాటలు కూడా పాడటం ప్రారంభించారు.

మనోహరం అనే తెలుగు సినిమాలో మంగళ గౌరీ అనే పాటతో ఆమె ఫుల్ టైమ్ నేపథ్యగాయనిగా మారిపోయారు.ఎమ్.ఎస్.విశ్వనాథన్, ఏ ఆర్ రెహమాన్, ఇళయరాజా, మణిరత్నం, కె.వి.మహదేవన్, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖ గాయకులు & సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు.ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల స్టేజ్ షోలు ఇచ్చి ఆమె రికార్డు సృష్టించారు.

అయితే కల్పన మ్యూజిక్ కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలోనే పెళ్లి అనే బంధం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది.ప్రేమించి పెళ్లి చేసుకున్న కల్పన కొంతకాలం వరకు చాలా సంతోషం గానే ఉన్నారు కానీ ఆ తర్వాత తన భర్త విపరీతంగా హింసించడం ప్రారంభించాడు.ఆమె కెరీర్ ని సర్వనాశనం చేయాలని ఎంతో ప్రయత్నించాడు.

తన భార్యకు తనకంటే ఎక్కువ గా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని.సమాజంలో గౌరవ మర్యాదలు తన భార్యకే ఎక్కువగా దొరుకుతున్నాయని కానీ తనకు ఏ మాత్రం ప్రాధాన్యత లభించడం లేదని బాగా బాధ పడిపోయేవారట.

అందుకే తన భార్య ని ఎలాగైనా వంటింటి కుందేలు చేయాలని ఆయన ప్రయత్నించారట.కానీ కల్పన సంగీతాన్ని వదిలి పెట్టకపోవడంతో ఆమెను వేధించడం ప్రారంభించాడు.

దీంతో చేసేదేమీ లేక తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కి విడాకులు ఇవ్వడానికి రెడీ అయిపోయారు.

అయితే అప్పటికే ఆమెకు ఒక బిడ్డ కూడా జన్మించింది.అయినా తన భర్త పెట్టే వేధింపులు తాళలేక కల్పన విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత తన బిడ్డకు తండ్రి, తల్లి తానే అయి.ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు.అలాగే తనకేంతో ఇష్టమైన సంగీతంలో మునిగితేలుతున్నారు.

ఇప్పటికీ పలు సినిమాల్లో, స్టేజ్ షో లలో పాటలు పాడుతూ తన జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నారు.బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా కూడా ఆమె పాటిస్పేట్ చేసి తన మంచి వ్యక్తిత్వాన్ని అందరికీ తెలియజేశారు.

ఏది ఏమైనా ఆమె తన భర్త కారణంగా ఎంతో విషాదకరమైన జీవితాన్ని అనుభవించారని చెప్పుకోవచ్చు.

#Kalpana #Kalapana #KalpanaPersonal #Kalpana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు