ఒకప్పుడు శృతి హాసన్ తో సినిమా అంటేనే దర్శక నిర్మాతలు భయపడేవారు.వామ్మో.
తనది ఐరన్ లెగ్ అని హడలిపోయేవారు.కానీ రాను రాను ఈ ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ అయ్యింది.
గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తో పవన్ కల్యాణ్ ప్లాప్ వరుసకు బ్రేక్ పడింది.ఈ మధ్య క్రాక్ మూవీతో 4 ఫ్లాపుల తర్వాత మళ్లీ రవితేజకు హిట్ వచ్చింది.
ఇందులో కూడా శృతి హీరోయిన్.అసలు సినిమా విజయం అనేది స్టోరీ, కంటెంట్, డైరెక్షన్ తో ముడిపడి ఉంటుంది.
కానీ శృతి హాసన్ ను టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగించేది.తాజాగా ఆమె నటించిన అన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గబ్బర్ సింగ్
జల్సా తర్వాత పులి, తీన్మార్, పంజా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.శృతి హాసన్ తో కలిపి నటించిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ సాధించింది.
క్రాక్
రాజా ది గ్రేట్ తర్వాత అట్లర్ ప్లాన్స్ ఉన్న మాస్ మహారాజ రవితేజని సేవ్ చేసింది క్రాక్ మూవీ.ఇందులో కూడా శృతి హీరోయిన్.
శ్రీమంతుడు
నేనొక్కడినే, ఆగడు సినిమాలతో అపజయాల బాటపట్టిన మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో హిట్ కొట్టాడు.ఇందులో మహేష్, శృతిహాసన్ జంటగా నటించారు.
ఎవడు
జంజీర్, తుఫాన్ లాంటి డిజాస్టర్ సినిమాల తర్వాత ఎవడు సినిమాతో బంఫర్ హిట్ కొట్టాడు రాం చరణ్.ఇందులోనూ శృతి హాసన్ నటించింది.
బలుపు
మిరపకాయ్ సినిమా తర్వాత వీర, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు లాంటి ఫ్లాప్ సినిమాలు తీశాడు.ఆ తర్వాత శృతి హాసన్ తో కలిసి నటించిన బలుపు సినిమా హిట్ సాధించింది.
రేసుగుర్రం
జులాయి తర్వాత ఇద్దరు అమ్మాయిలతో ప్లాప్ కొట్టాడు.ఆ టైంలో రేసుగుర్రం సినిమా చేశాడు.ఇందులో శృతిహాసన్ తో కలిసి నటించాడు బన్నీ.
ప్రేమమ్
మనం తర్వాత ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం, దోచెయ్ లాంటి ఫ్లాప్ పొందాడు.శృతితో కలిసి ప్రేమమ్ సినిమాతో హిట్ కొట్టాడు నాగ చైతన్య.
వకీల్ సాబ్
పవన్ తో మూడో సినిమా చేసిన శృతి హాసన్ ఈ సారి కూడా పవర్ స్టార్ కు హిట్ ఇచ్చింది.