హోమియో ఆసుపత్రిలో సిబ్బంది కొరత...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని ప్రభుత్వ హోమియో వైద్యశాలలో డాక్టర్, సిబ్బంది కొరత వేధిస్తుంది.దీర్ఘకాలిక రోగాలతో భాధపడుతున్న రోగులు హోమియో వైద్యంతో నయం అవుతాయనే నమ్మకంతో ఇక్కడికి వస్తే రెగ్యులర్ డాక్టర్, వైద్య సిబ్బంది అందుబాటులో లేక,రోగులకు సర్తెన సమయంలో ట్రీట్మెంట్ అందడం లేదని వాపోతున్నారు.

 Shortage Of Staff In Homeo Hospital, Homeo Hospital, Govt Homeo Hospital, Medica-TeluguStop.com

ఇక్కడ పని చేసే డాక్టర్ కు మూడు రోజులకు ఒకసారి డిపిటేషన్ ఇవ్వడం వల్ల రోగులు సరైన సమయంలో వైద్యం అందించలేకపోతున్నారని అంటున్నారు.

వారంలో ఆరు రోజులు ఇక్కడే వుండే విధంగా, వ్తెద్యశాలలో ఖాళీగా వున్న సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేస్తే డాక్టర్ పర్యవేక్షణలో రోగులకు నాణ్యమైన వ్తెద్యం అందే అవకాశం ఉందని చెబుతున్నారు.

జిల్లాలో భువనగిరి, పోచంపల్లి, కొలనుపాకలో మాత్రమే మూడు హోమియో వైద్యశాలలు వుండడం వల్ల,కొలనుపాక సెంటర్ కు అధిక సంఖ్యలో రోగులు రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వైద్య సిబ్బంది అంటున్నారు.ఇప్పటికైనా కొలనుపాక హోమియో వైద్యశాలకు పర్మినెంట్ డాక్టర్ తో పాటు సరిపడా వైద్య సిబ్బందిని నియమించి,ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube