ఏపీ సీఎం వైఎస్ జగన్ ( CM YS Jagan )పై జరిగిన దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు.జగన్ పై దాడి చేసిన వ్యక్తి అజిత్ సింగ్ నగర్( Ajit Singh Nagar ) వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తి అని సమాచారం అందుతోంది.
అతని పేరు సతీష్ కుమార్ ( Satish Kumar )అలియాస్ సత్తి అని సమాచారం అందుతోంది.జేబులో రాయిని తీసుకొచ్చి జగన్ పై దాడి చేసినట్టు తెలుస్తోంది.
ఈరోజు ఉదయం పోలీసులు సతీష్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
సతీష్ తో పాటు అతని నలుగురు స్నేహితులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రముఖ న్యూస్ ఛానల్ కథనం ద్వారా తెలుస్తోంది.
అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసుల నుంచి అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి.సెల్ ఫోన్ డేటా, ఇతర ఆధారాల ద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించినట్టు సమాచారం అందుతోంది.
ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఐదుగురు యువకుల ప్రమేయం ఉందని తెలుస్తోంది.మరికొన్ని గంటల్లో సతీష్ కుమార్ కు సంబంధించిన ఫోటోలు సైతం విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.జగన్ అభిమానులు తీసిన వీడియోల ద్వారా నిందితులను గుర్తించారని తెలుస్తోంది.నిందితుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
ప్రస్తుతం అత్యంత గోప్యంగా విచారణ జరుగుతోందని భోగట్టా.ఫుట్ పాత్ పై పార్కింగ్ టైల్స్ లో వాడే రాయితో ఈ దాడి చేసినట్టు సమాచారం అందుతోంది.ప్రణాళిక ప్రకారమే ఈ ఘటన జరిగిందని భోగట్టా.20 అడుగుల దూరం నుంచి జగన్ పై ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది.ఈ దాడి ఘటన వెనుక ఎవరైనా ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది.పోలీసుల ప్రకటన తర్వాత ఈ కేసు విషయంలో మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది.