జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో తన సినిమాల ద్వారా నందమూరి అభిమానులతో పాటు సాధారణ ఫ్యాన్స్ కు కూడా దగ్గరయ్యారు.తారక్ కథల ఎంపిక తీరు బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇతర హీరోలకు భిన్నంగా ముందుకెళుతూ ప్రతి సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే గత కొన్నేళ్లుగా చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సత్సంబంధాలు లేవు.
కారణాలు తెలియదు కానీ 2014, 2019 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారం చేయడానికి తారక్ దూరంగా ఉన్నారు.అయితే 2024 ఎన్నికలకు ఎన్నో నెలల సమయం లేదు.
ప్రస్తుతం టీడీపీకి తారక్ సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ కచ్చితంగా పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
అయితే ఈ నెల పదో తేదీన చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.ఆ వార్త విన్న నెటిజన్లు చంద్రబాబు తారక్ కలిస్తే మామూలుగా ఉండదని చెబుతున్నారు.అయితే టీడీపీ వర్గాలు, ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం వైరల్ అయిన వార్త ఫేక్ అని చెబుతున్నారు.
తారక్ మరికొన్ని రోజుల పాటు విదేశాల్లోనే ఉంటారని సమాచారం.
అందువల్ల తారక్ చంద్రబాబును కలవడం సాధ్యమయ్యే పని కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే రాబోయే రోజుల్లో తారక్ చంద్రబాబు కలిసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కలిస్తే ఆ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా సంచలనం అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.
తారక్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమవుతారని కామెంట్లు వినిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.