వాల్తేరు వీరయ్య లో రవితేజ పాత్ర ఉందా? ఇరికించారా?

ఈ సంక్రాంతి కి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా లో చిరంజీవి తో పాటు రవితేజ కీలక పాత్ర లో కనిపించాడు.

 Raviteja Role In Chiranjeevi Waltair Veerayya Movie,raviteja,waltair Veerayya,ch-TeluguStop.com

రవితేజ పాత్ర అనగానే 5 నుండి 10 నిమిషాలు వచ్చే పాత్ర అని చాలా మంది అనుకున్నారు.కానీ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా లో రవి తేజ పాత్ర ఏకంగా 50 నిమిషాల పాటు ఉంటుందట.

అంతే కాకుండా చిరంజీవి తో అత్యంత కీలక సన్నివేశాలు మరియు యాక్షన్స్ సన్నివేశాల్లో కూడా రవితేజ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.తాజాగా చిత్ర దర్శకుడు బాబీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రవితేజ ను మొదట ఈ సినిమా కు అనుకోలేదట, కానీ ఎప్పుడైతే కరోనా లాక్డౌన్ టైం లో సమయం దొరికిందో ఆ టైం లోనే మేము రవితేజ పాత్ర ను ఈ సినిమా లో క్రియేట్ చేశాం అన్నట్లుగా దర్శకుడు బాబీ చెప్పుకొచ్చాడు.

కేవలం అభిమానుల కోసమే రవితేజ ను వాల్తేరు వీరయ్యలో చూపించబోతున్నట్లుగా దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.దీన్ని బట్టి సినిమా లో రవితేజ పాత్ర మొదటి నుండి లేదని మధ్యలో ఇరికించారు అంటూ కొందరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.ఒక కథ ను తీసుకున్న తర్వాత దాంట్లో పాత్రలను ఇరికిస్తే కథ సోల్ మిస్ అవుతుంది.

కనుక రవితేజ పాత్ర ను ఇరికించడం ద్వారా వాల్తేరు వీరయ్య కు ఏమైనా డ్యామేజ్ జరిగిందా అనేది చూడాలి.అయితే అభిమానులు మాత్రం చిరంజీవి మరియు రవితేజ కాంబినేషన్ సన్నివేశాలు కచ్చితంగా సినిమా కు ప్రధాన ఆకర్షణ గా ఉంటాయి అన్నట్లుగా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

కచ్చితంగా వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుంది అని వారు నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube