ప్రస్తుత సమాజంలో ఊబకాయం ( Obesity )అతిపెద్ద సమస్య అని చెప్పవచ్చు.చాలామంది విపరీతంగా బరువు పెరిగి, ఆ బరువు కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలతో( health problems ) బాధపడుతున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.ఆ తర్వాత మళ్లీ బరువు తగ్గాలంటే చాలా సమయం పడుతుంది.
అయితే టక్కున బరువు తగ్గాలంటే కూడా అది సాధ్యమైన పని కాదు అని ఆలోచనలో ఉంచుకోవాలి.అయితే చాలామంది బరువు తగ్గడం కోసం విపరీతంగా వర్కౌట్ చేయడం తిండి మానేయడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు.
అయితే అది ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు.బరువు తగ్గాలంటే కొన్ని పద్ధతులు పాటించాలని, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలని చెబుతున్నారు.

బరువు తగ్గడం కోసం నిరంతరాయంగా చేయవలసిన పనులను చేస్తూ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అప్పుడే బరువు తగ్గుతారు.ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది.బరువు తగ్గాలంటే ఏం చేయాలంటే ప్రతి రోజు నీటిని పుష్కలంగా తాగాలి.ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి.ఇక తెల్లవారుజామున నిద్ర లేవాలి.
ఉదయం ఒక అరగంట పాటు వ్యాయామం చేయాలి.ఇక కాఫీలు, టీలు తాగడం( coffees , teas ) మానుకోవాలి.
అంతేకాకుండా పాల పదార్థాలు, స్వీట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్ లాంటివి తినడం పూర్తిగా మానేయాలి.కూల్ డ్రింక్స్ అయితే అస్సలు తాగకూడదు.
ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సాధ్యమైనంతవరకు ఎక్కువగా తినాలి.

ఇక బయట ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.మరి ముఖ్యంగా జంక్ ఫుడ్ ( Junk food )కు దూరంగా ఉంటే చాలా మంచిది.ఇంట్లో కూడా బాగా ఆయిల్ ఎక్కువ వేసిన ఫుడ్స్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ని అస్సలు తినకూడదు.
కార్బోహైడ్రేట్ ఉండే ఆహారం తినకుండా చూసుకోవాలి.ఎంత పని ఉన్న కూడా అల్పాహారాన్ని, మధ్యాహ్నం భోజనాన్ని రాత్రి డిన్నర్ నీ చాలా తొందరగా పూర్తి చేసుకోవాలి.
ఆలస్యంగా తింటే కొవ్వు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఆహారాన్ని పెద్ద మొత్తంలో ఒకేసారి తినకూడదు.
రోజులో ఎక్కువ సార్లు తిన్న కూడా పరవాలేదు.కొంచెం కొంచెంగా మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి.
ఈ పద్ధతులన్నీ పాటిస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.