బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు ఫస్ట్ సీజన్ స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం ఈ షో నిర్వాహకులు ఫీలవుతున్నారు.అయితే షోకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం విషయంలో బాలయ్య తప్పేం లేదని ఈ షోకు క్రేజ్ ఉన్న గెస్ట్ లు రాకపోవడం వల్లే ఈ విధంగా జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇకపై క్రేజ్ ఉన్న వాళ్లను మాత్రమే షోకు పిలవాలని ఈ షో నిర్వాహకులు భావిస్తున్నారు.
ప్రభాస్ హాజరైన ఎపిసోడ్ త్వరలో టెలీకాస్ట్ కానుండగా పవన్ హాజరయ్యే ఎపిసోడ్ కు సంబంధించి త్వరలో స్పష్టత రానుంది.
అయితే ఈ షోకు ఇద్దరు హీరోలు మాత్రం హాజరయ్యే అవకాశం లేదని సమాచారం అందుతోంది.ఆ హీరోలలో ఒక చిరంజీవి కాగా మరొకరు జూనియర్ ఎన్టీఆర్ అని తెలుస్తోంది.
బాలయ్యకు ఇష్టం లేకపోవడం వల్లే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఈ షోకు హాజరు కావడం కష్టమని బోగట్టా.
బాలయ్యను కాదని అన్ స్టాపబుల్ షోకు అతిథులను ఆహ్వానించే సాహసం ఈ షో నిర్వాహకులు చేయలేరనే సంగతి తెలిసిందే.
బాలయ్య సైతం తనకు కంఫర్ట్ ఉండే సెలబ్రిటీలను మాత్రమే ఈ షోకు ఆహ్వానిస్తున్నారని సమాచారం అందుతోంది.అయితే బాలయ్య ఈ ఇద్దరు సెలబ్రిటీలను ఎందుకు దూరం పెడుతున్నారో తెలియాల్సి ఉంది.
బాలయ్య గతంలో చిరంజీవితో కలిసి ఒక ఎపిసోడ్ చేయడానికి ఆసక్తి చూపించారని కామెంట్లు వినిపించినా ఈ ఇద్దరు హీరోల సినిమాల పోటీ వల్ల తాత్కాలికంగా ఈ ఎపిసోడ్ పై ఆశలు వదిలేసుకోవచ్చు.అయితే అన్ స్టాపబుల్ సీజన్2 సక్సెస్ కావాలని మెగా ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.బాలయ్య ఈ షో కోసం 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.అయితే బ్రాండ్స్ వల్ల ఆహా షోకు రికార్డ్ స్థాయిలో డబ్బులు వస్తున్నాయని సమాచారం.