తనతో నటించిన ఈ స్టార్ హీరోయిన్ల గురించి చిరంజీవి చెప్పిన విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవితో( Chiranjeevi ) ఒకసారి నటించిన హీరోయిన్లు ( Heroines )ఆయనతో మళ్లీ మళ్లీ నటించాలని ఆశ పడతారనే సంగతి తెలిసిందే.కొంతమంది హీరోయిన్లతో చిరంజీవి 10, 20 కంటే ఎక్కువ సినిమాలలో నటించారు.

 Shocking Facts About Chiranjeevi Details Here Goes Viral In Social Media Details-TeluguStop.com

ఆయా హీరోయిన్లు తమ డేట్లు అందుబాటులో లేకపోయినా చిరంజీవికి జోడీగా నటించే ఛాన్స్ మిస్ కాకూడదని డేట్లను అడ్జెస్ట్ చేసి నటించిన సందర్భాలు సైతం ఉన్నాయనే సంగతి తెలిసిందే.

Telugu Amala, Bhanu Priya, Chiranjeevi, Radha, Sridevi, Vijayshanthi-Movie

అయితే చాలా సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తనతో నటించిన హీరోయిన్ల గురించి మాట్లాడుతూ చిరంజీవి షాకింగ్ విషయాలను వెల్లడించారు.ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.తనతో నటించిన హీరోయిన్లలో ఒకరైన విజయశాంతి ( Vijaya shanthi ) కొంచెం బొద్దుగా అయితే బాగుంటుందని నా అభిప్రాయం అని చిరంజీవి కామెంట్లు చేశారు.

Telugu Amala, Bhanu Priya, Chiranjeevi, Radha, Sridevi, Vijayshanthi-Movie

అతిలోక సుందరి శ్రీదేవి ( Sridevi ) సహజ నటి అని చిరంజీవి చెప్పుకొచ్చారు.శ్రీదేవితో నటించాలంటే పోటీ పటి నటించాల్సి ఉంటుందని మెగాస్టార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.స్టార్ హీరోయిన్ శ్రీదేవి ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తారని ఆయన చెప్పుకొచ్చారు.హీరోయిన్ రాధ కొంచెం సన్నబడితే బాగుంటుందని చిరంజీవి పేర్కొన్నారు.రాధ బరువు తగ్గితే డ్యూయెట్స్ లో చేసే సమయంలో ఆమెను సులువుగా ఎత్తుకోవడం సాధ్యమవుతుందని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు.

భానుప్రియకు( Bhanu priya ), నాకు మధ్య ఎలాంటి సమస్య లేదు కానీ మా ఇద్దరి కుర్చీల మధ్య భేషజం ఉందని ఆయన తెలిపారు.

నా కుర్చీ, భానుప్రియ కుర్చీ దూరంగా వాలుతుంటాయని చిరంజీవి పేర్కొన్నారు.అమలకు పూర్తిస్థాయిలో తెలుగు వస్తే బాగుంటుందని ఆమెకు తెలుగు వస్తే మా ఇద్దరి కాంబో సీన్లు వేగంగా పూర్తవుతాయని ఆయన తెలిపారు.

చిరంజీవి ప్రస్తుతం వరుసగా క్రేజీ సినిమాలతో బిజీగా ఉండగా యంగ్ జనరేషన్ స్టార్ హీరోయిన్లు చిరంజీవికి జోడీగా నటించడానికి సిద్ధమవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube