తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్ ఈమే.. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారంటే?

మనలో చాలామంది తమ జీవితకాలంలో కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ సంపాదించలేరు.అయితే ఒక మహిళ మాత్రం 45 సంవత్సరాల వయస్సులోనే ఏకంగా 8700 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు.

 Shocking Facts About Business Woman Mahima Datla Details Here Goes Viral , Woman-TeluguStop.com

ఈమె తెలుగు రాష్ట్రాలలో రిచెస్ట్ ఉమెన్ కావడం గమనార్హం.యంగ్ బిజినెస్ ఉమెన్ మహిమా దాట్ల( mahima datla ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

హైదరాబాద్ కు చెందిన మహిమా దాట్ల బయోలాజికల్ ఇ అనే ఫార్మా సంస్థకు సీఈవోగా( CEO of a pharma company called Biological E ), మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు.రక్తం గడ్డ కట్టకుండా నిరోధించే హెపారిన్ మెడిసిన్( Heparin Medicine ) ద్వారా ఈ సంస్థ ప్రస్థానం మొదలైంది.

లండన్ లోని వెబ్స్టర్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ లో మహిమా దాట్ల బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.తండ్రి మరణం అనంతరం బయోలాజికల్ ఇ బాధ్యతలను ఆమె తీసుకున్నారు.

Telugu Ceopharma, Heparin, Mahima Datla, Tetanus Vaccine-Latest News - Telugu

మీజిల్స్, టెటానస్, రుబెల్లా( Measles, tetanus, rubella ) లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు ఈ సంస్థ నుంచి ఇతర దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి.ఈ సంస్థ వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం కూడా ఉంది.మహిమ దాట్ల కంపెనీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తన తెలివితేటలతో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా టర్నోవర్ ను పెంచుకున్నారు.ఏడాది కాలంలోనే ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయలు పెరిగి 8700 కోట్ల రూపాయలకు చేరుకునేలా చేశారు.

Telugu Ceopharma, Heparin, Mahima Datla, Tetanus Vaccine-Latest News - Telugu

ఈ సంస్థ టెటానస్ వ్యాక్సిన్ ( Tetanus vaccine )ను తయారు చేస్తున్న అతిపెద్ద సంస్థ కావడం గమనార్హం.గడిచిన పదేళ్లలో ఈ సంస్థ ద్వారా 200 కోట్లకు పైగా డోస్ లతో వ్యాక్సిన్ సరఫరా జరిగింది.ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్ ను సైతం తయారు చేసింది.ఆ వ్యాక్సిన్ వల్లే మహిమ ఆస్తులు అంచనాలకు మించి పెరిగాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈమె సంపన్న మహిళ కాగా ఏపీ, తెలంగాణలో ఉన్న ధనికుల్లో ఈమె పదో స్థానంలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube