83 ఏళ్ల వయస్సులో నాలుగోసారి తండ్రి కాబోతున్న నటుడు.. 29 ఏళ్ల యువతితో డేటింగ్ చేస్తూ?

హాలీవుడ్( Hollywood ) సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు హాలీవుడ్ నటుడు అల్ పాచినో( Al Pacino ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ హాలీవుడ్ హీరో వయస్సు ప్రస్తుతం ఏకంగా 83 సంవత్సరాలు కావడం గమనార్హం.అయితే ఈ వయస్సులో ఈ నటుడు మరోసారి తండ్రి కాబోతున్నారు.83 సంవత్సరాల వయస్సులో ఈ నటుడు నాలుగోసారి తండ్రి కానుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

 Hollywood Actor Al Pacino Will Welcome His Fouth Child Details, Al Pacino, Holly-TeluguStop.com

గత కొంతకాలంగా ఈ నటుడు 29 సంవత్సరాల వయస్సు ఉన్న నూర్ అల్ఫల్లా( Noor Alfallah ) అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు.నూర్ అల్ఫుల్లా గతేడాది గర్భం దాల్చగా ఆమెకు ఎనిమిది నెలలు నిండినట్లు తెలుస్తోంది.

గత నెలలో ఆల్ పచినో 83వ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్నారు.అల్ పచినో గొప్పదనం ఏంటంటే అమ్మాయిలతో రిలేషన్ కు ఓకే చెప్పే ఈ నటుడు పెళ్లిని మాత్రం అస్సలు ఇష్టపడడు.

గతంలోనే ఇద్దరు యువతులతో ప్రేమాయణం ద్వారా ఈ నటుడు అప్పుడు కూడా వార్తల్లో నిలిచాడు.యాక్టింగ్ కోచ్ అయిన జన్ తరంత్ తో మొదట ఈ నటుడు ప్రేమాయణాలు నడిపాడు.ఈ జంటకు 1989 సంవత్సరంలో జూలీ అనే కూతురు పుట్టింది.ఆ తర్వాత అల్ పచినో బెవర్లీ డియాంగీలోతో సహజీవనం చేశాడు.అల్ పచినో, బెవర్లీలకు ఆంటన్, ఒలీవియా కవలలు జన్మించారు.ఈ బంధాన్ని సైతం ఎక్కువరోజులు కొనసాగించలేదు.

ఆ తర్వాత అల్ పచినో నూర్ అల్ఫల్లాతో ప్రేమలో పడ్డారు.ఇటు అల్ పచినోకు మాత్రమే కాదు అటు నూర్ కు కూడా ఇది మూడో డేటింగ్ కావడం గమనార్హం.నాలుగోసారి తండ్రైన ఈ నటుడు నూర్ ను అయినా పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.ప్రస్తుతం ఈ నటుడు దేవిడ్ మామెట్స్ అసాసినేషన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube