కోట్ల రూపాయలు సంపాదించడం కంటే సంపాదించిన డబ్బులో కనీసం 10 శాతం అయినా దానం చేసే గుణం ఉన్నవాళ్లు ఎంతో గొప్పవాళ్లు అని చెప్పవచ్చు.అలా గొప్ప గుణం ఉన్నవాళ్లలో దర్శకుడు సుకుమార్( Director Sukumar ) ఒకరు.
తక్కువ సినిమాలే తెరకెక్కించినా ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో సుకుమార్ ఒకరు కాగా సుకుమార్ ఫ్రెండ్ కిట్టయ్య ఆయన గొప్పదనం గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.సుకుమార్ నా బెస్ట్ ఫ్రెండ్ అయినా నాకు భయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆర్య సినిమా సక్సెస్ అయిన తర్వాత ఊర్లో సుకుమార్ కు సన్మానం చేశారని కిట్టయ్య అన్నారు.సుకుమార్ నాన్నగారు డ్రామా యాక్టర్ అని ఆయన చెప్పుకొచ్చారు.
ఆర్య సినిమా( Arya Movie ) రిలీజైన సమయంలో అందరూ ఆశ్చర్యపోయారని కిట్టయ్య( Sukumar Friend Kittayya ) అన్నారు.ఊరికోసం సుకుమార్ చాలా చేశారని ఆయన తెలిపారు.
కరోనా సమయంలో సుకుమార్ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించి గవర్నమెంట్ ఆస్పత్రికి ప్లాంట్( Oxygen Plant ) ఇచ్చారని ఆయన తెలిపారు.కూలిపని చేసే కుటుంబాల కోసం సుకుమార్ సహాయం చేశారని ఊరిలో స్కూల్ కట్టించారని కిట్టయ్య కామెంట్లు చేశారు.
సుకుమార్ లో చిన్నప్పటి నుంచి సేవా గుణం ఉందని ఆయన తెలిపారు.స్నేహితులు ఇబ్బందుల్లో ఉంటే తన వంతు సహాయం చేసే మంచి గుణం ఆయనలో ఉందని కిట్టయ్య కామెంట్లు చేశారు.
సినిమా ఆర్టిస్ట్ లకు సైతం సుకుమార్ కష్టాల్లో ఉంటే సహాయం చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

బాల్యంలో సుకుమార్ నాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని కిట్టయ్య అన్నారు.నా జోలికి ఎవరైనా వస్తే సుకుమార్ ఊరుకునేవారు కాదని ఆయన తెలిపారు.సుకుమార్ రాబోయే రోజుల్లో పుష్ప2 సినిమా( Pushpa 2 )తో పాటు మరిన్ని సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
నిజమైన శ్రీమంతుడు సుకుమార్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.