మనుషులు తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న మనుషులను హేళనగా చూస్తారు.తామే అందరికంటే గొప్పవారిమని ఫీల్ అవుతూ ఉంటారు.
అలాగే సాధు జంతువులు, పక్షుల పట్ల ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంారు.అవి ఏమీ చేయలేవనే ఉద్దేశంతో వాటి పట్ల కనికరంగా లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.
జంతువులను హింసించి వాటి పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తూ ఉంటారు.తాజాగా నెమలి( Peacock ) పట్ల చులకనగా ప్రవర్తించిన ఒక మహిళకు షాక్ తగిలింది.
ఒక మహిళ ఏకాంతంగా గుడ్లు పొదుగుతున్న నెమలి వద్దకు వెళ్లింది.నెమలి గుడ్లను దొంగించేందుకు ప్రయత్నాలు చేసి బొక్కబోర్లా పడింది.నెమలి వద్దకు వెళ్లి దాని దగ్గర ఉన్న నాలుగు గుడ్లను చేతిలోకి తీసుకుంది.దీంతో మగ నెమలి మహిళపై దాడి చేసింది.ఆమెను తన కాళ్లతో బలంగా తన్ని గోళ్లతో పీకింది.నెమలి దెబ్బకు మహిళ ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు దొర్లుకుంటూ వచ్చింది.
దీంతో భయంతో అక్కడ నుంచి పారిపోయింది.మోటివేషన్ ఫర్ యూ అఫీషియల్ అనే ఇన్‌స్టాగ్రామ్( Instagram ) అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
మూగజీవాలు కదా ఏమీ చేయలేవనే భరోసాతో అడవిలో ఏకాంతంగా గుడ్లు పొదుగుతున్న నెమలి వెనుక వైపు నుంచి ఒక మహిళ వచ్చినట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.అయితే మహిళ వెనుకవైపు నుంచి వస్తుండటాన్ని నెమలి గమనించలేదు.దీంతో మహిళ వచ్చి నాలుగు గుడ్లను తీసుకుంది.ఆడ నెమలి పక్కన ఉన్న మరిన్ని గుడ్లను( Peacock egg ) తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.ఇది చూసి మగ నెమలి కోపంతో మహిళపై దాడి చేసి గాయపర్చింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.
మహిళకు నెమలి బాగా బుద్ది చెప్పిందని వ్యాఖ్యానిస్తున్నారు.