ఇక్కడే కాదు.. అక్కడ కూడా పూజా హెగ్డేకి చేజారింది

ముకుందా.ఒక లైలా కోసం సినిమా లతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే( Pooja Hegde ) మొదటి రెండు సినిమాలతో ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

 Pooja Hegde Loose One More Big Movie From Hands , Pooja Hegde, Harish Shankar,-TeluguStop.com

ఆ తర్వాత హిందీ లో ఒక సినిమా ను చేసింది.ఆ సినిమా కూడా నిరాశ పరిచింది.

ఎప్పుడైతే ఈ అమ్మడు తెలుగు లో అల్లు అర్జున్ కు జోడీగా హరీష్ శంకర్ ( Harish Shankar )దర్శకత్వం లో డీజే సినిమా లో నటించిందో అప్పటి నుండి ఫేట్ మారిపోయింది.

డీజే సినిమా( DJ movie ) వచ్చింది మొదలు గత ఏడాది వరకు బిజీ బిజీగానే ఉంది.కరోనా సమయంలో కూడా ఈమె మినిమం సినిమా లు చేస్తూనే వచ్చింది.అలాంటి పూజా హెగ్డే పాపం ఈ మధ్య కాలంలో ఆపర్లు లేక ఢీలా పడిపోయింది.

తెలుగు లో ఉన్న ఒకే ఒక్క పెద్ద ఆఫర్‌ మహేష్ బాబు గుంటూరు కారం( gunturu karam ) సినిమా కూడా చేజారి పోయింది.దర్శకుడు త్రివిక్రమ్‌ ఈమెను కోరి మరీ తీసుకున్నాడు.

కానీ ఆమెను మహేష్ బాబు వద్దనుకున్నాడు.దాంతో తప్పని పరిస్థితుల్లో ఆమెను తొలగించడం జరిగింది.

ఒక హీరోయిన్ కు చేతికి వచ్చిన ఆఫర్‌ చేజారితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

హీరోయిన్‌ గా బాలీవుడ్‌( Bollywood ) లో కూడా పూజా హెగ్డే పరిస్థితి అలాగే ఉంది.ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉన్నా కూడా హిందీ లో చేతికి వచ్చిన ఒక యంగ్ స్టార్‌ హీరో సినిమా ఛాన్స్ చేజారి పోయింది.హిందీ సినిమా చేజారడం కు కారణం ఏంటి అనే విషయం పై క్లారిటీ లేదు.

కానీ ఆమె హీరోయిన్ గా హిందీ లో చేయబోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా చేజారి పోయింది.ముందు ముందు అయినా ఈమెకు ఆఫర్లు వస్తాయా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube