టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న శివాజీ( Shivaji ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆయన చెప్పుకొచ్చారు.
మా అమ్మానాన్న కష్టాన్ని గుర్తు చేసిన కాలం గొప్పదని శివాజీ అన్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి చనిపోయారని ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి ఆ వ్యక్తి కొడుకు అయిన పెద్ద హీరోను హగ్ చేసుకోవాలని వెళ్లగా ఆ హీరో రెండు చేతులు పక్కకు తీశాడని తెలిపారు.
ఇక్కడ హోదా ఉంటే మాత్రమే మనం వీళ్లను హగ్ చేసుకోగలమేమో అని అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు.ఆ వ్యక్తులను చూస్తున్న సమయంలో ఎవరైనా చనిపోతారని ఎందుకు ఇవన్నీ అని అనిపించిందని శివాజీ తెలిపారు.మరో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడని అతనికి గుర్తు రావాలని ఈ విషయం చెబుతున్నానని శివాజీ అన్నారు.ఒక పెద్ద ఆర్టిస్ట్ నన్ను కలిసి రెమ్యునరేషన్ అడగగా నా రెమ్యునరేషన్ చెప్పానని ఆయన తెలిపారు.
ఆ పెద్ద ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి నాకు ఎక్కువ రెమ్యునరేషన్( Remuneration ) ఇస్తున్నారట కదా అని కామెంట్ చేయగా ఆ ప్రొడ్యూసర్ ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వలేదని శివాజీ చెప్పుకొచ్చారు.నేను తన మనిషి అని రెమ్యునరేషన్ చెప్పానని ఆయన తెలిపారు.భగవంతుడు నీకు ఛాన్స్ ఇచ్చాడంటే ఆ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని శివాజీ తెలిపారు.
చిరంజీవి( Chiranjeevi ) గారికి నేను వీరాభిమానినని ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారని అయన చెప్పుకొచ్చారు.ఇప్పటి హీరోలు చాలా స్మార్ట్ అని ఎవర్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారని శివాజీ పేర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్ కు నాకు ఒక వ్యక్తి గ్యాప్ క్రియేట్ చేశాడని నా అనుమానం అని ఆయన తెలిపారు.
శివాజీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.