6 వ వారం బిగ్ బాస్ 7 నుండి అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అవ్వబోయే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆమెనే!

ఒఊహకి అందని ట్విస్టులతో , కంటెస్టెంట్స్ ని తికమక పెడుతూ, రకరకాల చిత్రహింసలకు గురి చేస్తూ బిగ్ బాస్ సీజన్ 7 ఎలా సాగిపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.ఈ సీజన్ లో లేటెస్ట్ గా అర్జున్ అంబటి , అశ్విని, పూజా మూర్తి , నయని పావని( Arjun Ambati, Ashwini, Pooja Murthy, Nayani Pavani ) మరియు భోలే శివాలి వంటి వారు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టారు.

 She Is The Strong Contestant Who Will Be Eliminated From Bigg Boss 7 Week 6 With-TeluguStop.com

హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే కొత్త కంటెస్టెంట్స్ కి మరియు పాత కంటెస్టెంట్స్ కి మధ్య ఫిట్టింగ్ పెట్టేసాడు బిగ్ బాస్.కొత్త కంటెస్టెంట్స్ ని ‘పోటుగాళ్ళు’ టీంగా, అలాగే పాత కంటెస్టెంట్స్ ని ‘ఆటగాళ్లు’ టీం గా విభజించారు.

ముందుగా పోటు గాళ్ళు టీం లో ఉన్నవారిని ‘ఆటగాళ్లు’ టీం లో ఉండేవారిపై నామినేషన్స్ వెయ్యాలని బిగ్ బాస్ చెప్తాడు.అలాగే ‘ఆటగాళ్లు’ టీం నుండి కొత్త కంటెస్టెంట్స్ లో ఒకరిని, పాత కంటెస్టెంట్స్ లో ఒకరిని నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ కోరుతాడు.

Telugu Arjun Ambati, Ashwini, Bigg Boss, Nayani Pavani, Pooja Murthy, Shobha She

అలా జరిగిన ఈ నామినేషన్స్ ప్రక్రియ లో అమర్ దీప్, సందీప్, అశ్వినీ, నాయని పావని, పూజ పూర్తి, శోభా శెట్టి, యావర్ మరియు తేజా నామినేట్ అయ్యారు.సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్, బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House )లోకి అడుగుపెట్టగా, బిగ్ బాస్ అతనికి ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు.హౌస్ నుండి ఒకరిని నేరుగా నామినేట్ చెయ్యొచ్చు అని, అలాగే ఒకరిని నామినేషన్స్ నుండి తప్పించొచ్చు అని అంటాడు బిగ్ బాస్.ఆదివారం రోజు హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉంటే, అందులో సందీప్ తప్ప అందరూ తనని ఇంటి నుండి బయటకి పంపేందుకు సిద్దమైన విషయాన్నీ గుర్తు చేసుకుంటాడు గౌతమ్.

తన వైపు నిలబడ్డాడు కాబట్టి అతను సందీప్ ని నామినేషన్స్ నుండి సేఫ్ చేస్తాడు.ఇక మిగిలిన కంటెస్టెంట్స్ లో ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ లో ఓట్ల శాతం చూస్తే శోభ శెట్టి ( Shobha Shetty ) డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Telugu Arjun Ambati, Ashwini, Bigg Boss, Nayani Pavani, Pooja Murthy, Shobha She

హౌస్ లోకి వచ్చిన రోజు నుండి నేటి వరకు ఈమె ప్రతీ టాస్కు లో తన బెస్ట్ నూటికి నూరు శాతం ఇస్తూ వచ్చింది.ఆడవాళ్ళ వైపు నుండి పవర్ అస్త్ర ని గెల్చుకొని, మొట్టమొదటి హౌస్ మేట్ అయిన కంటెస్టెంట్ ఈమెనే.సుమారుగా మూడు వారాల నుండి నామినేషన్స్ లో లేని శోభా ఆట తీరుని చూసి జనాల్లో క్రేజ్ పెరిగిందని కొంతమంది అనుకుంటూ వచ్చారు.కానీ ఆమెకి ఇంకా ఎలాంటి ఆదరణ దక్కలేదు అని ఈ పోలింగ్ చూస్తేనే అర్థం అవుతుంది.

బహుశా ‘కార్తీక దీపం’ సీరియల్ లో ఆమె పోషించిన విలన్ రోల్ ప్రభావం జనాల్లో ఇంకా ఉండడం వల్లే ఇలా అయ్యుండొచ్చు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube