శర్వానంద్, నిత్యామీనన్ జంటగా ‘రాజాధిరాజా’

‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ వరుస విజయాలను సాధించిన హ్యాట్రిక్ హీరో శర్వానంద్, నిత్యామీనన్ జంటగా డి.ప్రతాప్ రాజు సమర్పణలో బృందావన్ పిక్చర్స్ బ్యానర్ పై సెన్సిబుల్ డైరెక్టర్ చేరన్ దర్శకత్వంలో ఎన్.

 Sharwanand’s Rajadhi Raja In March Last Week-TeluguStop.com

వెంకటేష్ నిర్మిస్తున్న చిత్రం ‘రాజాధిరాజా’.లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం మార్చి మూడోవారంలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధమవుతుంది.

ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.ఈ సందర్భంగా…

చిత్ర నిర్మాత ఎన్.వెంకటేష్ మాట్లాడుతూ ‘’ రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా సక్సెస్ లతో హ్యాట్రిక్ హీరో అయిన శర్వానంద్ ఇప్పుడు ‘రాజాధిరాజా’ చిత్రంతో సెకండ్ హాట్రిక్ స్టార్ట్ చేస్తాడు.మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు సినిమాతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శర్వానంద్, నిత్యామీనన్ ల జోడి మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యింది.

లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో లవ్, ఎమోషన్స్, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటాయి.తెలుగులో విజయవంతమైన నా ఆటోగ్రాఫ్ తమిళ మాతృకను తెరకెక్కించిన సెన్సిబుల్ డైరెక్టర్ చేరన్ ప్రతి సన్నివేశాన్ని బ్యూటీఫుల్ గా తెరకెక్కించారు.

సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.తెలుగు నుండి తమిళంలో సినిమాను అనువదించి, తెలుగు, తమిళంలో సినిమాను ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.మార్చి రెండో వారంలో జి.వి.ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల చేసి మార్చి మూడోవారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

శర్వానంద్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: జి.వి.ప్రకాష్ కుమార్, , కెమెరా: సిద్ధార్థ్, డైలాగ్స్: రమణ మాలెం, ఎడిటర్: జి.రామారావు, సాహిత్యం: అనంత్ శ్రీరాం, ఆర్ట్: రాజీవన్, జి.సెల్వకుమార్, సహ నిర్మాత: పి.శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.సాయికృష్ణ, నిర్మాత: ఎన్.వెంకటేష్, దర్శకత్వం: చేరన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube