షారుక్ కు సెంటిమెంట్ గా మారిన వైష్ణోదేవి మాత ఆలయం...సినిమా విడుదలకు ముందు దర్శనం?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shahrukh Khan) వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.షారుక్ ఖాన్ ఈ ఏడాదిలోనే రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రెండు సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి.

 Shahrukh Khan Visited Vaishno Devi Matha Temple Before His Dunki Movie Release ,-TeluguStop.com

అయితే తాజాగా మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.డిసెంబర్ 21వ తేదీ షారుఖ్ ఖాన్ నటించినటువంటి డంకీ (Dunki)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో షారుఖ్ ఖాన్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.అయితే ఇటీవల కాలంలో షారుక్ ఖాన్ నటించిన సినిమాలు విడుదలకు ముందు ఈయన వైష్ణోదేవి ( Vaishno Devi) మాత ఆలయం సందర్శించేవారు.

Telugu Salaar, Bolly Wood, Dunki, Prabhas, Shahrukh Khan, Tollywood, Vaishno Dev

షారుఖ్ ఖాన్ నటించినటువంటి పఠాన్, జవాన్ సినిమాలో విడుదలకు ముందు ఈయన ఈ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.ఇక ఈ రెండు సినిమాలు కూడా అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్నాయి.ఈ క్రమంలోనే మరి కొద్ది రోజులలో డంకీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో షారుఖ్ ఖాన్ మరోసారి వైష్ణోదేవి మాత ఆలయాన్ని సందర్శించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Salaar, Bolly Wood, Dunki, Prabhas, Shahrukh Khan, Tollywood, Vaishno Dev

ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన పలు ప్రదేశాలకు వెళ్తూ దైవ దర్శనాలను కూడా చేసుకుంటున్నారు.ఇకపోతే ఈయన ప్రతి సినిమా విడుదలకు ముందు ఇలా వరుసగా వైష్ణోదేవి మాత ఆలయాన్ని సందర్శించడంతో ఈ ఆలయం తనకు సెంటిమెంట్ గా మారిపోయింది అంటూ పలువురు భావిస్తున్నారు.ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే షారుక్ సినిమా పక్క హిట్ అవుతుందన్న సెంటిమెంట్ ఆయనలో ఏర్పడిందని అందుకే ఇటీవల ఈయన సినిమాలు విడుదలకు ముందు అమ్మవారిని దర్శించుకుంటున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రభాస్ సలార్ ( Salaar )సినిమా రెండు పోటీ పడిపోతున్నాయి .ఈ పోటీలో ఎవరు సక్సెస్ అందుకుంటారు అని అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube