షారుక్ కు సెంటిమెంట్ గా మారిన వైష్ణోదేవి మాత ఆలయం…సినిమా విడుదలకు ముందు దర్శనం?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shahrukh Khan) వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

షారుక్ ఖాన్ ఈ ఏడాదిలోనే రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రెండు సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి.

అయితే తాజాగా మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

డిసెంబర్ 21వ తేదీ షారుఖ్ ఖాన్ నటించినటువంటి డంకీ (Dunki)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో షారుఖ్ ఖాన్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

అయితే ఇటీవల కాలంలో షారుక్ ఖాన్ నటించిన సినిమాలు విడుదలకు ముందు ఈయన వైష్ణోదేవి ( Vaishno Devi) మాత ఆలయం సందర్శించేవారు.

"""/" / షారుఖ్ ఖాన్ నటించినటువంటి పఠాన్, జవాన్ సినిమాలో విడుదలకు ముందు ఈయన ఈ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.

ఇక ఈ రెండు సినిమాలు కూడా అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్నాయి.ఈ క్రమంలోనే మరి కొద్ది రోజులలో డంకీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో షారుఖ్ ఖాన్ మరోసారి వైష్ణోదేవి మాత ఆలయాన్ని సందర్శించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/" / ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన పలు ప్రదేశాలకు వెళ్తూ దైవ దర్శనాలను కూడా చేసుకుంటున్నారు.

ఇకపోతే ఈయన ప్రతి సినిమా విడుదలకు ముందు ఇలా వరుసగా వైష్ణోదేవి మాత ఆలయాన్ని సందర్శించడంతో ఈ ఆలయం తనకు సెంటిమెంట్ గా మారిపోయింది అంటూ పలువురు భావిస్తున్నారు.

ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే షారుక్ సినిమా పక్క హిట్ అవుతుందన్న సెంటిమెంట్ ఆయనలో ఏర్పడిందని అందుకే ఇటీవల ఈయన సినిమాలు విడుదలకు ముందు అమ్మవారిని దర్శించుకుంటున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రభాస్ సలార్ ( Salaar )సినిమా రెండు పోటీ పడిపోతున్నాయి .

ఈ పోటీలో ఎవరు సక్సెస్ అందుకుంటారు అని అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

స్పోర్ట్స్ టీషర్ట్ లో కనిపించిన మహేష్ బాబు.. ధర తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!