రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కాయి.సెక్స్ రాకెట్ ను ఓ బీజేపీ మహిళా నేత నిర్వహిస్తోందని పోలీసులు గుర్తించారు.
గత నెల 22వ తేదీన ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది.తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారని బాలిక పేర్కొంది.
దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేశారు.అధికార పార్టీ బాధ్యతలో ఉంటూ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులపై పలువురు మండిపడ్డారు.
రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ జిల్లాకు చెందిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సునీతా వర్మ ఓ మైనర్ బాలికతో స్నేహం చేసి ఆ బాలికను రాజకీయ నాయకుల వద్ద, ప్రభుత్వ అధికారుల వద్ద బలవంతంగా వ్యభిచారం చేయించి డబ్బులు తీసుకున్నట్లు తేలడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ మేరకు సునీతా వర్మను విచారణ జరుపగా ఈ సెక్స్ రాకెట్ తో సంబంధం ఉన్న ముగ్గురు ప్రభుత్వ మహిళా ఉద్యోగులను, మరో మహిళను అరెస్ట్ చేశారు.మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే సెక్స్ రాకెట్ నిర్వహణపై ఆరోపణ ఎదుర్కొంటున్న బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సునీతా వర్మను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది.కాగా, ఈ కేసులో కాంగ్రెస్ సేవాదళ్ నాయకురాలు పూనం చౌదరికి సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో పార్టీ అధిష్టానం కొట్టివేసింది.
పూనమ్ చౌదరి ఎవరో తమకు తెలియదని రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింగ్ సింగ్ వెల్లడించాడు.