పసిడి పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎంతోమంది భారతీయులకు పసిడి అంటే చాలు ఎప్పుడు కొనాలి అని ఆలోచిస్తుంటారు.
కానీ పసిడి ధరలు మాత్రం దారుణంగా పెరిగిపోయాయి.ఎంత దారుణంగా పెరిగాయ్ అంటే మరో మూడేళ్ళ తర్వాత పెరగాల్సిన బంగారం ధరలు ఇప్పుడే పెరిగాయ్.
కరోనా వైరస్ వంటి దారుణమైన పరిస్థితులలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయ్.ఇక అలానే ఈ వారం కూడా బంగారం ధర భారీగా పెరుగుతూ తగ్గుతూ వచ్చింది.ఈ వారం సోమవారం నుంచి శనివారం వరకు బంగారం ధరల్లో చాలా దారుణమైన మార్పు కనిపించింది.వారం ప్రారంభంలో భారీగా తగ్గిన బంగారం ధర నిన్న శనివారంకు భారీగా పెరిగిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు గత నాలుగు వారాలుగా భారీగా పెరుగుతున్నాయ్.అయితే ఈ వారంలో పెరిగే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.ఇక వెండి ధర కూడా అలానే భారీగా తగ్గింది.గత వారం 65 వేల రూపాయిలు ఉండగా ఈ వారం 62 వేల రూపాయలకు చేరింది.
అయితే ఇప్పుడు అంతో ఇంతో తగ్గిన బంగారం ధరలు పండగ సీజన్ ప్రారంభం అయ్యాక భారీగా పెరుగుతాయని అంటున్నారు మార్కెట్ నిపుణులు.అయితే వెండి ధర కూడా కేవలం మూడు నెలల్లో ఏకంగా 20 వేల రూపాయిలు పెరిగింది.
ఇక ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,900 రూపాయిల వద్దకు చేరగా, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,500 రూపాయల వద్దకు చేరింది.ఇక వెండి ధర కూడా అలానే కొనసాగుతుంది.
ఏకంగా 500 రూపాయిల పెరుగుదలతో 62,300 రూపాయలకు చేరింది.ఇక పండగ సీజన్ వస్తే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.