ఈ మధ్యకాలంలో వరుసగా సినీ సెలెబ్రెటీలు వారి పిల్లలు పెళ్లి వైపు అడుగులు వేస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.ఇక ఈ ఏడాది ఎంతో మంది సెలబ్రిటీలు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించగా, మరికొంతమంది నిశ్చితార్థం జరుపుకొని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సమయంలోనే సీనియర్ దివంగత నటుడు అంబరీష్, నటి సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిగింది.
సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.
ఈయన తన ప్రియురాలు అబివాతో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.వీరి నిశ్చితార్దానికి పలువురు కన్నడ సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేసినట్లు తెలుస్తోంది.
ఇక వీరి నిశ్చితార్థ వేడుకకు ప్రముఖ కన్నడ నటుడు యశ్ తన భార్యతో కలిసి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ నిశ్చితార్థం జరుపుకున్నారని తెలియడంతో ఎంతోమంది అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీనియర్ నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.అయితే ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.ఇక తన భర్త రాజకీయాలలో కొనసాగుతూ ఉండగా అంబరీష్ మరణం తర్వాత ఈమె రాజకీయాలలో కొనసాగుతూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇకపోతే ప్రస్తుతం తన కుమారుడి నిశ్చితార్థ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.