ఏపీ సీఎం జగన్ పనితీరుపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా, జనాల్లో మాత్రం జగన్ పరిపాలన పై బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది.ముఖ్యంగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలు సైతం ఆశ్చర్యపోయేలా ఉంటున్నాయి.
కష్టకాలంలో ఏపీ ఆర్థిక వ్యవస్థ చతికిలపడినా, జగన్ మాత్రం ఎక్కడ సంక్షేమ పథకాలు లేకుండా చూసుకుంటున్నారు.ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా, పూర్తిగా అప్పులతోనే ప్రభుత్వం నడుస్తోందని , ప్రతిపక్షాలు పెద్దఎత్తున రాద్దాంతం చేస్తూ , జగన్ ను తక్కువ చేసి చూపిస్తున్నారు.
అయినా, జగన్ మాత్రం ఎక్కడా సంక్షేమ పథకాలకు ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ చేస్తున్నారు.ఈ పథకం, ఆ పథకం అని రకరకాల పథకాల పేరుతో సొమ్ములు వేస్తూ , కరోనా కష్టకాలంలో వారిని ఆదుకుంటూ, జనాల గుండెల్లో నిలిచి పోతున్నారు.
జగన్ పని అయిపోయిందని, జనాల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది అని, వైసీపీకి ఇక కష్టకాలమే అంటూ విమర్శలు వస్తున్నా, జనాలు మాత్రం తమ ఓటుతో జగన్ పై తమకున్న అభిమానాన్ని చాటి చెప్పుకుంటున్నారు.ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే జగన్ హవా ఎంతగా ఉందో అర్థమవుతోంది.
త్వరలోనే బద్వేల్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి.అక్కడ తమకు తిరుగులేదు అనేది వైసీపీ అభిప్రాయం.ఇటీవల ఏలూరులో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో నూ వైసిపి తమ పట్టు నిలుపుకోవడం విపక్షాలు కూడా మింగుడు పడడం లేదు.జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత లేదు అనే విషయాన్ని ప్రజలు నిరూపించిన ట్లుగా అక్కడ ఫలితాలు వెలువడ్డాయి.

ఇంకా అనేక కొత్త కొత్త సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తూ వస్తుండడంతో, చాలా వాటి గురించి కోర్టుల్లో కేసులు వేస్తూ వాటిని అడ్డుకుంటూ ఉండడంతో, జనాల్లో ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది.ఇది కూడా జగన్ కు కాస్త ప్లస్ పాయింట్ గా మారింది.కేంద్ర అధికార పార్టీ బిజెపి సైతం వేధింపులకు దిగుతున్నట్లు వ్యవహరిస్తుండడం, ఇలా అనేక అంశాలు జగన్ కు అడ్వాంటేజ్ గా మారాయి.రాబోయే సార్వత్రిక ఎన్నికలలోనూ మళ్లీ తాము అధికారంలోకి వస్తామనే అభిప్రాయం జగన్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
అందుకే ప్రతిపక్షాల విమర్శలను పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.