Samyuktha Menon: ఫ్యామిలీ తో గొడవ పెట్టుకుంటున్న సంయుక్త మీనన్.. కారణం అదేనా..?

మలయాళ నటి సంయుక్త మీనన్ ( Samyuktha Menon ) అంటే ప్రస్తుతం సౌత్లో పరిచయం అక్కర్లేని హీరోయిన్.ఈమె టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) చేసిన భీమ్లా నాయక్ అనే సినిమాలో విలన్ రానాకి భార్యగా నటించి ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసారా, కోలీవుడ్ హీరో ధనుష్ తో సార్, సాయి ధరమ్ తేజ్ తో విరూపాక్ష వంటి సినిమాల్లో నటించింది.

 Samyuktha Menon Is Having A Fight With Her Family Is That The Reason-TeluguStop.com

అంతేకాకుండా ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో డెవిల్ ( Devil )అనే సినిమాలో కూడా నటించింది.కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ,తమిళ భాషల్లో ఈ హీరోయిన్ పదుల కొద్ది సినిమాల్లో నటించింది.

అంతేకాదు జంగా అనే వెబ్ సిరీస్ లో కూడా సంయుక్త మీనన్ నటించింది.ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సంయుక్త మీనన్ పేరు ఇండస్ట్రీలో అంతగా పేరు వినిపించడం లేదు.

అయితే ఒకేసారి తారాజువ్వల ఇండస్ట్రీలో తన పేరును ఎంతగానో వైరల్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సైలెంట్ గా ఉండడానికి కారణాలు ఏంటి అని చాలామంది నెటిజెన్లు ఈమె గురించి ఆరాతీస్తున్నారు.

Telugu Bheemala Nayak, Bimbisara, Devil, Dhanush, Kalyan Ram, Pawan Kalyan, Rana

అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.సంయుక్త మీనన్ కుటుంబంలో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడంవల్ల ఇండస్ట్రీ కి కాస్త బ్రేక్ ఇచ్చిందని,అందుకే ఈ మధ్యకాలంలో ఆమె ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించడం లేదు అని భావిస్తున్నారు.ఇక మరికొంతమందేమో ఒక నిర్మాత ( Producer ) అవకాశం ఇస్తానని చెప్పి మధ్యలో ఆమెను పక్కనపెట్టి మరో హీరోయిన్ ని తీసుకున్నాడని,ఈ కారణంతోనే కాస్త డిస్టర్బ్ అయిన సంయుక్త మీనన్ ఇండస్ట్రీలో కనిపించడం లేదని కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

మరి ఈ రెండింటిలో ఏది నిజమో తెలియదు కానీ సంయుక్త మీనన్ ప్రస్తుతం సైలెంట్ అవ్వడం ఆమె అభిమానులు జీర్ణించుకోవడం లేదు.మళ్లీ వరుస సినిమాలు చేసి ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube