Samsung Galaxy Book 4 : శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 ల్యాప్ టాప్ లాంచ్.. ధర, ఫీచర్ వివరాలు ఇవే..!

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ నుంచి అద్భుతమైన ఫీచర్లతో మరో సరికొత్త ల్యాప్ టాప్ మార్కెట్ లోకి విడుదలైంది.శాంసంగ్ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ బుక్ 4( Samsung Galaxy Book 4 ) సిరీస్ పేరుతో ఈ ల్యాప్ టాప్ ను లాంచ్ చేసింది.

 Samsung Galaxy Book 4 Series To Launched In India-TeluguStop.com

ఈ ల్యాప్ టాప్ ధర, ఫీచర్ వివరాలు ఏమిటో చూద్దాం.ఈ సిరీస్ లో భాగంగా గెలాక్సీ బుక్ 4ప్రో 360,( Galaxy Book 4 Pro 360 ) గెలాక్సీ బుక్ 4 360 పేర్లతో రెండు ల్యాప్ టాప్ లు అందుబాటులోకి వచ్చాయి.

శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 360 ల్యాప్ టాప్:

ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల ఫుల్ HD సూపర్ AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, గ్రాఫిక్స్ ప్రాసెస్ యూనిట్, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ లాంటి ఫీచర్ లతో వస్తుంది.ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కు( Fast Charging Support ) అవసరమైన అద్భుతమైన ఫీచర్ లతో రానుంది.ఈ ల్యాప్ టాప్ ధర రూ.114990 గా ఉంది.

గెలాక్సీ బుక్ 4 ప్రో 360 :

గెలాక్సీ బుక్ 4 ప్రో 360 మోడల్ లో 16 అంగుళాల డైనమిక్ AMOLED 2 ఎక్స్ టచ్ స్క్రీన్ ను అందించారు.ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.163990 గా ఉంది.ఇప్పటికే ఈ ల్యాప్ టాప్ ఫ్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.ఈ ల్యాప్ టాప్ ను అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వారు రూ.5000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.అంతే కాదు రూ.10 వేల విలువైన బ్యాంక్ క్యాష్ బ్యాక్ లేదంటే రూ.8 వేల వరకు అప్ గ్రేడ్ బోనస్, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI లాంటి ఆఫర్స్ ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube