తండ్రి రైతు.. ఇంటర్ లో 968 మార్కులు సాధించిన సాయిశ్వేత.. ఈమె సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఉన్నత లక్ష్యాలను సాధించాలని భావించే వాళ్లకు పేదరికం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ ఇబ్బందుల వల్ల లక్ష్యాలను సాధించలేని పరిస్థితి మాత్రం ఉండదు.అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాపెర్ల సాయిశ్వేత అనే యువతి మాత్రం సులువుగానే లక్ష్యాలను సాధించారు.

 Saiswetha Inspirational Success Story Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

ప్రభుత్వ కాలేజ్ లో చదివి కూడా సాయిశ్వేత( saiswetha ) 968 మార్కులు సాధించడం ద్వారా వార్తల్లో నిలవడం జరిగింది.

అన్నమయ్య జిల్లాలోని మిట్ట కమ్మపల్లి( Mitta Kammapally in Annamaya District ) గ్రామంలో సాయిశ్వేత జన్మించగా అమ్మ అంజనమ్మ నాన్న కాపెర్ల సుబ్బారాయుడు ఎంతో కష్టపడి సాయిశ్వేతను చదివించారు.

ఏడో తరగతి వరకు సొంతూరిలోనే ప్రైవేట్ స్కూల్ లో చదివిన సాయిశ్వేత ఆ తర్వాత ఆర్థిక సమస్యల వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదవాల్సి వచ్చింది.హిందీ టీచర్ సత్తార్ హుస్సేన్ ( Teacher Sattar Hussain )ఆమెకు పుస్తకాల విషయంలో సహాయ సహకారాలు అందించారు.

Telugu Mittakammapally, Saiswetha, Teachersattar-Inspirational Storys

పదో తరగతిలో 530 మార్కులు సాధించిన సాయిశ్వేత ఆ తర్వాత ఉన్నత చదువులు చదువుకోవాలని భావించారు.అయితే అదే సమయంలో సాయిశ్వేత కుటుంబానికి వ్యవసాయం కలిసిరాక ఇబ్బందులు పెరిగాయి.పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతున్నామని తల్లీదండ్రులు బాధ పడేవారని సాయిశ్వేత పేర్కొన్నారు.ఆ సమయంలో కుటుంబం అంతా రాజంపేటకు చేరుకున్నామని వెల్లడించారు.

Telugu Mittakammapally, Saiswetha, Teachersattar-Inspirational Storys

నాన్నకు ఎలక్ట్రిక్ పనుల విషయంలో అనుభవం ఉందని ఆ పనులు చేస్తూనే నాన్న సంపాదన మొదలుపెట్టారని ఆమె తెలిపారు.అదే సమయంలో కరోనా వల్ల తిండికి సైతం ఇబ్బందులు ఎదురయ్యాయని సాయిశ్వేత వెల్లడించారు. 968 మార్కులతో కాలేజ్ టాపర్ గా నిలవడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.సాయిశ్వేత చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాపర్ల సాయిశ్వేత సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.సాయిశ్వేత రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు భావిస్తున్నారు.

సాయిశ్వేత టాలెంట్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube