టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెల్లడిస్తున్న విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.తాను నాన్ వెజ్ తిననని అయితే ప్రేమించిన వ్యక్తి కొరకు చికెన్ షాప్ లో నాన్ వెజ్ కొనుగోలు చేసి వండి పెట్టానని ఆమె అన్నారు.
అదే సమయంలో పెళ్లి విషయంలో సింగిల్ గా ఉంటానో లేక తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానో అని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.
అయితే సాయిపల్లవి చేసిన కామెంట్లను విన్న అభిమానులు ఆమె తెలుగబ్బాయిని పెళ్లి చేసుకోనుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో సాయిపల్లవి ప్రేమలో ఉందని ఆ హీరో కూడా ప్రస్తుతం సింగిల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.త్వరలో ఆ హీరో పేరును వెల్లడించి సాయిపల్లవి షాకిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు భావిస్తున్నారు.
విరాటపర్వం సినిమా విడుదలైన తర్వాత తన ప్రేమ, పెళ్లి గురించి సాయిపల్లవి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.
సాయిపల్లవి వయస్సు ప్రస్తుతం 30 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.సాయిపల్లవి గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటారు కాబట్టి పెళ్లి చేసుకున్నా ఆమె కెరీర్ పై పెద్దగా ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే లేవని చెప్పవచ్చు.సాయిపల్లవికి కుటుంబ సభ్యుల సహాయసహకారాలు కూడా ఉన్నాయి.
ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే సాయిపల్లవి చాలా విషయాలలో భిన్నమనే సంగతి తెలిసిందే.అయితే పెళ్లి, పిల్లలు వంటి కీలక విషయాలకు సంబంధించి ఆమె అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.సాయిపల్లవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సాయిపల్లవి ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.