ఎన్నికల వేళ ఆయా పార్టీల జయాపజయాలపై సర్వేలు, విశ్లేషణలు తెరపైకి వస్తూనే ఉంటాయి.కొన్ని సర్వే సంస్థలు ప్రజానాడీని కచ్చితంగా అంచనా వేస్తూ విజయాలను ముందే వెల్లడిస్తుంటాయి.
మరికొన్ని సర్వేలు( Political Surveys ) పార్టీల వ్యక్తిగత సర్వేలుగా మారి.ఆయా పార్టీలకు అనుకూలంగా నివేధికలు ఇస్తూ ఉంటాయి.
అయితే ఏ సర్వేలు ఎలా ఉన్నప్పటికి కొన్నిసార్లు సర్వేల ఫలితాలే వాస్తవమౌతాయి.కొన్నిసార్లు అవాస్తవమౌతాయి.
అందుకే సర్వేల నివేధికాలపై అందరికీ క్యూరియాసిటీ కాస్త ఎక్కువగానే ఉంటుంది.ఇక తెలంగాణ ఎన్నికల( Telangana Elections ) వేళ ఇప్పటివరకు చాలా సర్వేలే బయటకు వచ్చాయి.
కొన్ని సర్వేలు బిఆర్‌ఎస్ కు( BRS ) పట్టం కడితే.మరికొన్ని సర్వేలు కాంగ్రెస్( Congress ) వైపు మొగ్గు చూపాయి.ఇంకొన్ని సర్వేలు హంగ్ ఏర్పడుతుందని తేల్చి చెప్పాయి.అయితే ఇప్పటివరకు బహిర్గతం అయిన చాలా సర్వేలు ఫెక్ అని విశ్లేషకులు కొట్టి పారేస్తున్నారు.కేవలం ఓటర్లను ఆకర్శించేందుకు ఆయా పార్టీలు ఫెక్ సర్వేలను సృష్టిస్తూ గందరగోళాని గురి చేస్తున్నాయనేది కొందరి అభిప్రాయం.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా సర్వేలను ఫెక్ గా సృష్టించిందని బిఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
సి ఓటర్, సౌత్ ఫస్ట్, పల్స్ ఆఫ్ తెలంగాణ, లోక్ పాల్. ఇలా చాలా సర్వే సంస్థల పేరుతో కాంగ్రెస్ ఫెక్ సర్వేలు సృష్టించించిందని టిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
అయితే కాంగ్రెస్ మాత్రం తాము చేయించిన సర్వేల ఆధారంగా 70-80 సీట్లు సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు.అటు బిఆర్‌ఎస్ విషయానికొస్తే 90-100 స్థానాల్లో విజయం గ్యారెంటీ అని ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు.దీన్ని బట్టి చూస్తే ఇరు పార్టీలు కూడా విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయనే సంగతి స్పష్టమౌతుంది.అయితే ప్రజల అభిప్రాయాన్ని సర్వేలు పూర్తిగా అంచనా వేయగలవా ? అంటే ముమ్మాటికి కాదనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.రాజకీయాల్లో సర్వేల అంచనాలు తలకిందులు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.మరి ఈసారి అధికారం విషయంలో తెలంగాణ ప్రజలనాడీని సర్వేలు ఎంతవరకు అందుకుంటాయో చూడాలి.