భాషతో సంబంధం లేకుండా అన్ని ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తోంది.కొన్ని ఏరియాలలో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేస్తోంది.
ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమా అద్భుతాలను సృష్టిస్తోంది.రెండో వీకెండ్ లో ఇక్కడ అన్ని థియేటర్లలో ఆర్ఆర్ఆర్ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది.
ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ సినిమా ఇక్కడ 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లను సాధించింది.
ఫుల్ రన్ లో ఈ సినిమా క్రాస్ రోడ్స్ లో ఏకంగా 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.
ఏఎంబీ సినిమాస్ లో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని మెయిన్ థియేటర్ లో పెద్ద సినిమాలు అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం.హైదరాబాద్ లోని పలు థియేటర్లలో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు పెద్ద సినిమాలకు సులభంగానే వస్తుండటం గమనార్హం.
ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న 4 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోందని సమాచారం అందుతోంది.

వీక్ డేస్ లో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు తగ్గినా వీకెండ్ లో మాత్రం భారీస్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.చరణ్, తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్కిన సక్సెస్ ను ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాల్సి ఉంది.చరణ్, తారక్ భవిష్యత్ సినిమాలు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నాయి.

చరణ్ త్వరలో ఆచార్య ప్రమోషన్స్ తో బిజీ కానుండగా తారక్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు.తారక్ కొత్త సినిమా కొరకు ఏకంగా 8 కిలోల బరువు తగ్గనున్నారు.తారక్ కు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు.అలియా భట్ ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపిస్తారని తెలుస్తోంది.