మళ్లీ జగన్‌ ను కలిసిన జక్కన్న... కారణం ఇదేనా?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధమైంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.

 Rrr Director Rajamouli Meet With Cm Ys Jagan Mohan Reddy , Rrr , Rajamouli , Ys-TeluguStop.com

ఇద్దరు హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు వరుస ఈవెంట్లో పాల్గొనడం తో పాటు పదుల కొద్ది ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.జాతీయ స్థాయిలో ఈ సినిమా ను ప్రమోట్ చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

దుబాయ్ తో పాటు ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఈవెంట్లు నిర్వహించబోతున్నారు.ఈ సమయంలో ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి మరియు నిర్మాత దానయ్య అమరావతి వెళ్లి ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కలవడం పట్ల చర్చ జరుగుతోంది.

ఈ కలయిక కారణం ఏంటి అనే విషయంపై స్పష్టత రాలేదు కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అదనపు షో కి అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్లారని తెలుస్తోంది.కొత్తగా వచ్చిన జీవో ప్రకారం ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరిగిన చిత్రాలకు మాత్రమే అదనపు షో లకు అనుమతి ఇవ్వాల్సి ఉంది.

కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా 20 శాతం చిత్రీకరణ ఏపీ లో జరుగకున్నా కూడా అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.అందుకే నిర్మాత దానయ్య మరియు దర్శకుడు రాజమౌళి ప్రత్యేకంగా వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు సమాచారం అందుతుంది.

Telugu Dvv Danayya, Jr Ntr, Rajamouli, Ram Charan, Tollywood, Ys Jagan-Movie

ఇదే సమయంలో కొత్తగా టికెట్ల రేట్లను పెంచినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు అని సమాచారం.రాజమౌళి ఆమధ్య చిరంజీవితో కలిసి టికెట్ల రేట్లు పెంపు విషయమై జగన్మోహన్ రెడ్డితో తో జరిగిన భేటీ కి హాజరు అయిన విషయం తెలిసిందే.ఆ భేటీ తర్వాతనే సీఎం జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ల రేట్లపై ఓకే కొత్త జీవో విడుదల చేయడం జరిగింది.కొత్త జీవో రాజమౌళి సినిమా కి చాలా హెల్ప్ అవుతుంది.

అందుకే రాజమౌళి ప్రత్యేకంగా వెళ్లి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అని సమాచారం అందుతోంది.రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమా మార్చి 25 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube