సీనియర్లు టీ20 మ్యాచ్లకు దూరంగా ఉండడంపై స్పష్టత ఇచ్చిన రోహిత్ శర్మ..!

వెస్టిండీస్( West indies ) పర్యటనలో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం భారత జట్టులో సీనియర్లు కాకుండ అంతా యువ ఆటగాళ్లే ఉండడంపై రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు.

 Rohit Sharma Clarified On Seniors Staying Away From T20 Matches..! ,rohit Sharma-TeluguStop.com

ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్ చేయడానికి సీనియర్లను టీ20 లకు దూరంగా ఉంచడం జట్టు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం అని రోహిత్ శర్మ( Rohit Sharma ) తెలిపాడు.దాదాపుగా గత 8 నెలలుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ లాంటి సీనియర్ ఆటగాళ్లు టీ 20 ఫార్మట్ ఆడడం లేదు.2024 లో టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ యువ ఆటగాళ్ల జట్టును సిద్ధం చేసే క్రమంలో.ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) సారథ్యంలో యువ ఆటగాళ్ల టీం తో టీ20 సిరీస్ లు ఆడిస్తోంది.

అందుకే సీనియర్లను పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

తమ ముందున్న అతి ముఖ్యమైన టోర్నీ వన్డే ప్రపంచ కప్( ODI WC 2023 ) అని ఈ సందర్భంగా అందరికీ ఒక స్పష్టత ఇస్తున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు.ప్రతి మ్యాచ్ ఆడితే ఆటగాళ్లపై పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని తెలిపాడు.

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కోసం ప్రతి భారతీయుడు ఎదురు చూస్తున్నాడని, భారత్ ప్రతి మ్యాచ్లో అద్భుత ఆటను ప్రదర్శించాలని భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతతో, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని తెలిపాడు.ఈ 2023 వన్డే వరల్డ్ కప్ టైటిల్ ను భారత్ ముద్దాడుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపాడు.ప్రస్తుతం సీనియర్లంతా వన్డే వరల్డ్ కప్ పై దృష్టి పెట్టారని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube