సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని పాపులర్ అయినటువంటి వారిలో నటి రీతు చౌదరి( Ritu Chaudhary )ఒకరు.ఈమె యూట్యూబ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అనంతరం బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ మాత్రమే కాకుండా పలు స్పెషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొని సందడి చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో రీతు చౌదరి చేసే హంగామా మామూలుగా ఉండదని చెప్పాలి.ఈమె పొట్టి నిక్కర్లు ధరించి పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ అభిమానులను సందడి చేస్తూ ఉంటారు.
ఇలా తరచూ గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసి ఈమె తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది చూసినటువంటి ఎంతో మందిని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
తరచూ బీచ్ ల వెంట పొట్టి నిక్కర్లు ధరించి బికినీలో దర్శనమిచ్చే రీతూ చౌదరి ఇలా ఇంత పద్ధతిగా మారిపోయింది ఏంటి అంటూ అందరూ షాక్ అవుతున్నారు.ఈమె లంగా వోని ధరించి చేతినిండా గాజులు, మెడలో నగలు తలలో పువ్వులు పెట్టుకొని అచ్చమైన తెలుగింటి ఆడపడుచుల ముస్తాబయి గుడిలో పెద్ద ఎత్తున సందడి చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ రీల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ రీల్ వీడియో పై ఎంతోమంది నెటిజెన్స్ స్పందిస్తూ చేస్తున్నటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఎన్ని రోజులకు ఇలా నిండుగా దుస్తులు ధరించావు రీతు అంటూ కామెంట్లు చేయగా ఈ డ్రెస్ లో అచ్చం తెలుగుతనం ఉట్టిపడుతుంది చాలా సాంప్రదాయ బద్ధంగా ఉన్నావు తరచూ ఇలాంటి దుస్తులు వేయచ్చు కదా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే కొందరు మాత్రం బయట మాత్రం పొట్టి నిక్కర్లు వేసుకుని తిరుగుతూ ఉంటావు గుడికి మాత్రం మంచి డ్రెస్ వేసుకొని వచ్చావు అంటూ ఈమె వస్త్రధారణ పై కామెంట్లు చేస్తున్నార.అయితే తన వ్యవహార శైలి కారణంగా ఈమె కొన్నిసార్లు భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు అయినప్పటికీ వాటి గురించి పెద్దగా పట్టించుకోరని చెప్పాలి.