బ్రిటన్ ప్రధాని పీఠానికి అడుగు దూరంలో మాజీ ఆర్థిక మంత్రి, కన్జర్వేటివ్ నేత రిషి సునక్ ఉన్నారు.అయితే ప్రధాని గా రిషి సునక్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.
ఇప్పటికే ఆయనకు 188 మంది ఎంపీల మద్ధతు లభించింది.కన్సర్వేటివ్ పార్టీలో సగానికన్నా ఎక్కువ మంది మద్ధతు రిషికే ఉండటం గమనార్హం.
పెన్నీ మోర్డాంట్ మాత్రమే ప్రధాని రేసులో సునాక్ తో పోటీకి నిలిచారు.అయితే, రేసులో నిలవాలంటే కనీసం వంద మంది ఎంపీల మద్దతును ఆమె కూడగట్టాల్సి ఉంటుంది.
అయితే 90 మంది ఎంపీల మద్ధతు ఉందని మోర్డాంట్ క్యాంప్ చెబుతోంది.కాగా మరికాసేపట్లో నామినేషన్ ల గడువు ముగియనుంది.
ఆ సమయంలోపుగా ఎంపీల మద్దతు సాధించడంలో మోర్డాన్ విఫలమైతే రిషి సునాక్ ప్రధానిగా గెలుపొందినట్లే.పోటీలో ఎవరూ నిలవకపోవడంతో సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటిస్తారు.