ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను అనుకున్న మేర సక్సెస్ చేయడంలో ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారు.భారీ జన సందోహం మధ్య ఆవిర్భావ సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా బిజెపి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేసి చూపిస్తామో కెసిఆర్ ఈ సభలోనే ప్రకటించారు.
తమ పార్టీ ప్రణాళికలను , విధి విధానాలను కేసీఆర్ ప్రకటించారు.అయితే కెసిఆర్ ప్రకటనలపైన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ పైన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని బీజేపీ చెర నుంచి విడిపించి అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్న కెసిఆర్ మరి గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎందుకు అభ్యర్థులను పోటీకి దింపలేదని రేవంత్ ప్రశ్నించారు.
అంతేకాదు తెలంగాణ అసెంబ్లీని ఫిబ్రవరి చివరివారంలో రద్దు చేస్తారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నేతలను కేసీఆర్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ చెప్పుకొచ్చారు.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుండా కేసీఆర్ కుట్రలు మొదలుపెట్టారని, కర్ణాటకలో 25 మంది కాంగ్రెస్ నేతలతో ఇటీవల కెసిఆర్ మాట్లాడాలని ఈ సందర్భంగా 500 కోట్ల ఆఫర్ వారికి ఇచ్చారని రేవంత్ ఆరోపించారు.
తక్కువ మెజారిటీతో గెలిచి నాయకులను లక్ష్యంగా కేసీఆర్ చేసుకుని ఈ ఆపరేషన్ కు తెర తీశారు అనే విషయం కాంగ్రెస్ అధిష్టానానికి తెలియడంతో వారిని ఏఐసిసి పెద్దలు పిలిపించి వార్నింగ్ ఇచ్చారని రేవంత్ చెప్పుకొచ్చారు .
ఇక కాంగ్రెస్ తెలంగాణ వ్యూహకర్త సునీల్ కానుగోలు కార్యాలయం పై దాడి వెనుక చాలా కారణాలు ఉన్నాయని, ఈ విషయం కుమార్ స్వామికి కూడా తెలుసునని , ఆయన బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు రాకపోవడానికి కూడా కారణం అదేనని రేవంత్ చెప్పుకొచ్చారు.దీంట్లో బీఆర్ఎస్ నేతల భాగస్వామ్యం ఉందని రేవంత్ అన్నారు.ఎల్ఐసి ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది అని, కాంగ్రెస్ నిర్మించిన కర్మాగారాలను ప్రధాని నరేంద్ర మోది అమ్ముకుంటున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.