అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్ శక్తులకు మేలు జరిగేలా చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనకపోవడంతో రైతులు కార్పొరేట్ శక్తుల వైపు వెళ్లక తప్పని పరిస్థితి కల్పిస్తున్నాయి.ఆధాని, అంబానీ లకు రైతులు వారి పంటలను అమ్ముకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు.
దేశానికే అన్నపూర్ణ తెలంగాణ అని చెప్పిన సీఎం కేసీఆర్, వరి ధాన్యాన్నే కొనకుండా కూర్చున్నావు వరితో పాటు ఏ పంటనూ కొనడం లేదు కేంద్ర ప్రభుత్వం కొనడం లేదంటూ కేసీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రం కొననప్పుడే కదా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలి.
కేంద్రం కొనకపోతే రాష్ట్రం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి కదా.మరి కేసీఆర్ ఎందుకు ఉన్నట్టు.దొంగలా దొరికిపోయావు కాబట్టే, కేంద్ర ప్రభుత్వం మెడపై కత్తిపెట్టిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు’మెడ మీద కత్తి‘ అనే పదానికి అర్థం ఏంటో తెలంగాణ సమాజానికి చెప్పాలి తెలంగాణ రైతులు పండించిన ధాన్యానికి కొన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండే హక్కు మీకు ఉందా.
వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై మీకు అవగాహన ఉందా.గతంలో రైతులు వరికి బదులు మొక్కజొన్న, చెరకు, పత్తి పండిస్తే పండించ వద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు .పప్పు దినుసులు పండిస్తే వాటికి సరైన గిట్టుబాటు ధర లేకుండా చేశారు. ఖమ్మం జిల్లాలో మిర్చి గిట్టుబాటు ధర కోసం రైతుల ఆందోళన చేస్తే వారికి బేడీలు వేయించారు కేంద్ర ప్రభుత్వం కొన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి కదా.ప్రత్యామ్నాయ పంటలు వేసినప్పుడు వాటికి గిట్టుబాటు ధరతో పాటు రైతులకు సరైన వసతులు కల్పించాలి కదా ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు నీకు తెలియదా….నువ్వేమన్నా చిన్నపిల్లాడివా
.