ఆర్ధిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, సైనిక ఇలా ఏ రంగంలో చూసుకున్నా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ ప్రపంచానికే పెద్దన్నగా వెలుగొందుతోంది అమెరికా.కనుసైగతో ఏ దేశాన్నైనా కట్టడి చేయగల అగ్రరాజ్యానికి అధ్యక్షుడంటే ఎలా వుండాలి.
ఆ హుందా, డాబు, దర్పం అంతా మాటల్లో, చేతల్లోనే కనిపిస్తుంది.ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారంతా తప్పో, ఒప్పో ఏదో ఒక రకంగా దేశ గౌరవాన్ని పెంచేందుకే కృషి చేశారు.
కానీ ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ తీరు విచిత్రంగా వుంటోంది.అపార అనుభవం, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దేశాధినేతగా ఆయన ఎదిగారు.
78 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బైడెన్.అగ్రరాజ్య చరిత్రలో అత్యంత పెద్ద వయస్కుడైన దేశాధినేతగా రికార్డుల్లోకెక్కారు.2024 నాటికి ఆయనకు 82 ఏళ్లు వస్తాయి.ఇప్పటికే వృద్ధాప్యం సహా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న బైడెన్.
పూర్తి కాలం పదవీలో కొనసాగలేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రతిపక్ష రిపబ్లికన్లు ఆయన వయసుపై విమర్శలు చేస్తూనే వున్నారు.
మొన్నామధ్య కమలా హారీస్‌ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు.అంతేకాదు మంత్రుల పేర్లు, వారి హోదాలను సైతం ఆయన చెప్పలేక తడబడ్డారు.
ఆతర్వాత ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కుతూ మూడు సార్లు కాలు జారి కిందపడిపోవడంతో డెమొక్రాట్లతో పాటు రిపబ్లికన్లలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.తాజా బైడెన్ మరోసారి అభాసుపాలయ్యారు.
నిన్నగాక మొన్న చైనా స్పీడుకు బ్రేక్ వేసే లక్ష్యంతో యూఎస్, బ్రిటన్, ఆస్ట్రేలియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది.ఈ మూడు దేశాలు కలిసి AUKUS కూటమిగా ఏర్పడ్డాయి.
దీని కింద అణు జలాంతర్గాములను సమకూర్చుకునేందుకు ఆస్ట్రేలియాకు అమెరికా, బ్రిటన్ సహకారం అందించనున్నాయి.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఒప్పందం జరిగింది.
ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.మొదట యూకే ప్రధాని బోరిస్‌కు , తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని వైపు తిరిగి ఆయన పేరు గుర్తుకురాకపోవడంతో సహచరుడు అని అర్థం వచ్చేలా సంబోధించి, కృతజ్ఞతలు తెలియజేశారు.
అదే సమయంలో ఆయన సంబోధించిన #ThatFellaDownUnder అనే పదం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.అయితే తమ ప్రధాని పేరు మర్చిపోవడంతో ఆస్ట్రేలియా ప్రజలు, మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దీనిపై బైడెన్‌ను సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు కంగారూలు.

తాజాగా మరో చర్యతో ఆయన అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఇజ్రాయెల్ నూతన ప్రధాని నఫ్టాలి బెన్నెట్‌తో జరిగిన సమావేశంలో బైడెన్ నిద్రపోయారు.ఇందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల పరిష్కారమే లక్ష్యంగా ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బెన్నెట్ ఎంపికైన సంగతి తెలిసిందే.దీంతో 12 ఏళ్ల దేశాన్ని ఏలిన నెతన్యాహు పదవిని కోల్పోయారు.
ఈ క్రమంలోనే బైడన్ పై తన అక్కసును వెళ్లగక్కారు నెతన్యాహూ.అంతేకాదు బెన్నెట్ ప్రభుత్వాన్ని పడగొట్టి.
మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన శపథం చేశారు.