దర్శకధీరుడు రాజమౌళి సినీ కెరీర్ లో సింహాద్రి, మగధీర సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది.ఎన్టీఆర్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో సింహాద్రి సినిమా ఒకటి కాగా రామ్ చరణ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో మగధీర సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.
కలెక్షన్ల విషయంలో 100 డేస్, 175 డేస్ సెంటర్ల విషయంలో ఈ సినిమాలు రికార్డులను క్రియేట్ చేశాయి.దర్శకుడిగా రాజమౌళికి ఉన్న పాపులారిటీని ఈ సినిమాలు మరింత పెంచాయనే సంగతి తెలిసిందే.
టీవీలలో ఇప్పుడు ప్రసారమైనా ఈ సినిమాలకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి.అయితే ఈ సినిమాలకు సంబంధించి ఒక విషయంలో మాత్రం జక్కన్న అప్పట్లో హర్ట్ అయ్యారు.ఒక ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.గతంలో 50 రోజుల కేంద్రాలు, 100 రోజుల కేంద్రాలకు సంబంధించి ఫేక్ లెక్కలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చేవి.
సింహాద్రి సినిమా 175 రోజుల థియేటర్ల విషయంలో కొన్ని ఎక్కువ థియేటర్లను చూపించడంతో రాజమౌళి హర్ట్ అయ్యారు.
తన తర్వాత సినిమాల విషయంలో ఆ తప్పు రిపీట్ కాకూడదని రాజమౌళి భావించేవారు.
మగధీర సినిమా షూటింగ్ మొదలైన సమయంలోనే రాజమౌళి అల్లు అరవింద్ కు తనకు సెంటర్ల విషయంలో ఫేక్ రికార్డులు నచ్చవని వెల్లడించారు.అల్లు అరవింద్ సైతం మొదట అందుకు ఓకే చెప్పారు.
అయితే ఫ్యాన్స్ ఒత్తిడితో మగధీర సినిమా 100 రోజుల సెంటర్ల విషయంలో ఫేక్ నంబర్లు ప్రచారంలోకి వచ్చాయి.
జక్కన్న వెళ్లి అల్లు అరవింద్ ను అడగగా ఫ్యాన్స్ వల్ల అలా చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పడం రాజమౌళికి నచ్చలేదు.అల్లు అరవింద్ తో రాజమౌళికి విభేదాలు ఉన్నాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి రాగా ఆ వార్తలు మాత్రం నిజం కాదని జక్కన్న వెల్లడించారు.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మార్చి 25వ తేదీన రిలీజ్ కానుంది.