తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన సొంత ఫామ్ హౌస్ అయిన ఎర్రవెల్లికి ఎంతో అనుబంధం ఉంది.కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఎంత ఫుల్ బిజీగా ఉన్నా ఆయన ఫామ్ హౌస్‌కు వెళ్లి అక్కడ సేద తీరుతూ ఉంటారు.
ఆయన సీఎం అయ్యాక కూడా చాలా రోజులు ఫామ్ హౌస్ నుంచి పాలనా వ్యవహారాలు చూసే వారు.దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.
ఓ వైపు సెక్రటేరియట్‌లో ఫైళ్లు కుప్పలా పేరుకుపోతుంటే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్‌లో ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు సంధించారు.
అయితే కేసీఆర్ కొద్ది రోజులుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు వెళ్లడం లేదు.
ఇందుకు విపక్షాల విమర్శల సంగతి ఎలా ఉన్నా అనేక కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.కేసీఆర్ తరచూ ఇక్కడకు వస్తుండడంతో ఇక్కడ భారీ స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి వస్తోంది.
కేసీఆర్ ఇక్కడకు వచ్చారన్న వార్త తెలిస్తే వివిధ సమస్యలపై ఫైట్ చేసే ఆందోళన కారులు ఆయనకు వినతిపత్రాలు ఇచ్చేందుకు వస్తున్నారు.
ఫామ్ హౌస్‌కు పది కిలోమీటర్ల ముందు నుంచే సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడంతో పాటు అసాధారణ రీతిలో భద్రత కల్పించాల్సి వస్తోంది.
ఇక్కడ పోలీసులు రెండు మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున భద్రత కల్పించాల్సి వస్తోంది.ఇవన్నీ కేసీఆర్ దృష్టికి వెళ్లాయి.
దీంతో పాటు అక్కడ వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం పంటలు వేయకపోవడం కూడా కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లకపోవడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.