ఒకప్పుడు పచ్చబోట్లు వేసుకున్న వారిని చూస్తే పాతకాలపు మనుషులు, పచ్చబోట్లతో చర్మాన్ని పాడుచేసుకోవడం ఏంటి అని కామెంట్లు చేసేవారు.కాని ఆ పచ్చబొట్టుకే టాటూ అని పేరు పెట్టేసరికి ఫ్యాషన్ అయిపోయింది.
వయసు సంబంధం లేకుండా అందరు టాటూలు వేయించుకుంటున్నారు.వేయి రూపాయలోనే పర్మనెంట్ టాటూ వేస్తున్నారు హైదరాబాద్ లో.టాటూ అంత చవకగా మారింది కాబట్టే ఎక్కడపడితే అక్కడ, ఎవరు పడితే వారు వేయించేసుకుంటున్నారు.

ఇక సినిమాల వాళ్ళ టాటూ పిచ్చి మీకు తెలిసిందే.హీరోలు తక్కువ కాని, హీరోయిన్లు మాత్రం చాలా ఇష్టంగా టాటూలు వేయించుకుంటున్నారు.మహేష్ బాబు భార్య చేయి మీద భర్త, ఇద్దరు పిల్లల పేర్లు ఉంటాయి.
ఇక సమంత చేయుకి ఏ టాటూ అయితే ఉందో, సరిగ్గా అదే ప్లేసులో అదే టాటూని నాగచైతన్య కూడా వేయించుకున్నాడు.ఆ టాటులో ఏం అర్థం దాగుందో ఈ ప్రేమజంటకే తెలియాలి.
త్రిష ఛాతిభాగంలో టాటూ కొన్నేళ్ళ నుంచి ఫేమస్.అనసూయ కి కూడా అక్కడే టాటూ ఉంటుంది.
అయితే వీరందరికన్నా టాటూ పిచ్చి ఎవరికి ఎక్కువ ఉందో తెలుసా? శృతిహాసన్ కి.అవును కమల్ హాసన్ కూతురికి మామూలు టాటూ పిచ్చి కాదు.
శృతికి ఏకంగా అయిదు టాటులు ఉన్నాయి.చెవి వెనుక ఒకటి, భుజంపై ఒకటి, పాదాల దగ్గర ఒకటి, వీపు దగ్గర ఒకటి, మరొకటి మణికట్టు దగ్గర.ఈ ఐదు టాటూల్లో మణికట్టు దగ్గర ఉన్న టాటూ శృతికి అస్సలు ఇష్టం లేదట.ఆ టాటూ వేయించుకుంటున్నప్పుడు అర్థం కాలేదు కాని, ఇప్పుడు ఆ టాటూ ఎందుకు వేయించుకున్నానా అని అనిపిస్తుందట.
ఆ టాటూతో శృతి ఎంత ఇబ్బంది పడుతోందంటే, అది కనబడకుండా ఉండేందుకు స్పెషల్ మేకప్ వాడుతోంది.ఈ విషయాన్ని శృతి హాసన్ స్వయంగా చెప్పింది.
ఆ టాటూని కవర్ చేసుకునేందుకు తట్టెడు మేకప్ వాడుతోందట.