తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలోనే జరగనున్న ఉప ఎన్నికలో ఈ టికెట్ విషయంపై జనసేన పట్టుబడుతోంది.బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో సొంతగా నిర్ణయం తీసుకోలేక.
బీజేపీని ఒప్పించేందుకు తలకు మించిన భారంగా భావిస్తోంది ఇప్పటికే ఈ టికెట్ విషయంపై ఢిల్లీకి రెండు సార్లు వెళ్లిన పవన్.తమకు ఈ టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు.
కానీ, అంతే పట్టుద లతో బీజేపీ కూడా వ్యవహరిస్తోంది.ఇప్పటికే అభ్యర్థి ప్రకటన తప్ప.
గ్రౌండ్ లెవిల్లో ఎంత చేయాలో అంతా చేసింది.ఒకానొక దశలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ.
ప్రకటన కూడా జారీ చేసింది.అయితే.
జనసేన నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాష్ట్ర కమలం పార్టీ నేతలు వెనక్కి తగ్గారు.
అయితే.
తాజాగా ఇదే విషయంపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.చర్చించారు కూడా.
అయినా.క్లారిటీ రాలేదు.“ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా.మీరెందుకు తొందరపడుతున్నారు? “ అని ఎదురు ప్రశ్నలే కేంద్ర బీజేపీ పెద్దల నుంచి పవన్‌కు ఎదురయ్యాయి.మార్చి రెండో వారంలో దీనిపై క్లారిటీ ఇస్తామని అంటున్నారు.కట్ చేస్తే.అసలు ఇంతగా జనసేన ఈ టికెట్ కోసం ఎందుకు పట్టుబడుతోంది? అనేది కీలక ప్రశ్న.తిరుపతిలో మెగా అభిమానులు ఉన్నారు.
పైగా పవన్ ఇక్కడ 2014లో సభ నిర్వహించినప్పుడు.తర్వాత కాలంలోనూ ఆయనకు మంచి స్పందన వచ్చింది.
దీనిని బట్టి ఇక్కడ తాము గెలుపు గుర్రం ఎక్కడం తథ్యమని ఆ పార్టీ భావిస్తోంది.

అయితే.ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే.రెండో వైపు అత్యంత కీలక వ్యూహం జనసేన అవలంబిస్తోందని అంటున్నారు.
ప్రస్తు తం చిత్తూరు జిల్లాలో టీడీపీ దూకుడు లేకుండా పోయింది.వాస్తవానికి చంద్రబాబు సొంత జిల్లానే అయినా.
ఇక్కడ పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉంది.ఇక, బీజేపీ కూడా పుంజుకునే పరిస్థితి లేదు.
ఈ క్రమంలో ఇక్కడ ఏర్పడిన రాజకీయ ప్రత్యామ్నాయ శూన్యతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తిరుపతి ఉప ఎన్నిక ఉపయోగపడుతుందని పవన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.మొత్తానికి పవన్ చాలా రోజుల తర్వాత మంచి స్కెచ్ యితే వేసినట్టే కనిపిస్తోంది.
తిరుపతిలో గెలుపు గుర్రం ఎక్కడం ద్వారా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టవచ్చని పార్టీ నేతలు దృష్టి పెట్టారు.పైగా సీమపై ప్రత్యేక అభిమానం చూపించే పవన్‌కు ఇది కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.
అందుకే తిరుపతి టికెట్‌పై పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారని తెలుస్తోంది.మరి చివరాఖరుకు బీజేపీ ఏం చేస్తుందో చూడాలి.