రెడీ లైట్స్ ఆఫ్.. సుధీర్ సరసాలకు రష్మీ షాక్

టాలీవుడ్ బుల్లితెరపై సుధీర్, రష్మీ జంట గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే.ఈ జంట బుల్లితెరపై చేసే సందడి మాత్రం అంతా ఇంతా కాదు.

 Ready Lights Off Rashmi Shock For Sudheer Words, Rashmi, Sudheer, Tollwood, Comm-TeluguStop.com

తమ రొమాన్స్ తో రచ్చ చేస్తూ అందరి దృష్టిలో పడ్డారు.పైగా వీరి మధ్య రిలేషన్ గురించి బయట కూడా నానారకాలుగా మాట్లాడేసుకున్నారు జనాలు.

ఈ జంట తొలిసారిగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో నుండి పరిచయమయ్యారు.

ఇక రష్మీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సుధీర్ స్టార్ కమెడియన్ గా నిలిచి మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.వీరిద్దరూ జబర్దస్త్ షో లో చేసే రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

అలా జబర్దస్త్ షో లో ఈ జంట బాగా హైలెట్ గా నిలిచింది.నిజానికి వీళ్ళ మధ్య ఉన్న బంధం చూసినట్లయితే వీళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నారా అనే అనుమానం రాక తప్పదు.

వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉండటంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే టాక్ చాలాసార్లు వినిపించింది.ఈ షో లోనే కాకుండా బుల్లితెరలో ప్రసారమౌతున్న పలు షోలలో కూడా ఈ జంట బాగా రచ్చ చేస్తుంటారు.

ఇక గతంలో బుల్లితెర వేదికగా వీరి పెళ్లి కూడా చేశారు మల్లెమాల ప్రొడక్షన్.ఎన్నోసార్లు వీరి మధ్య మంచి ప్రపోజల్ సన్నివేశాలు కూడా జరిగాయి.

Telugu Rashmi, Sudheer, Telugu, Tollwood-Movie

రొమాంటిక్ డాన్స్ లతో మాత్రం ప్రేక్షకులను తమవైపు లాక్కున్నారు ఈ జంట.దీంతో బుల్లితెర ప్రేక్షకులకు ఈ జంట మంచి అభిమానంగా మారటంతో.వీరి పేరు పైన సోషల్ మీడియాలో ఎన్నో ఖాతాలు సృష్టించి వాటి వేదికగా తమకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంటారు తమ అభిమానులు.

ఈ జంట కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమైన లాస్ట్ సీజన్ ఢీ డాన్స్ షో లో కూడా టీం లీడర్ గా చేశారు.

అందులో కూడా వీరి మధ్య రొమాన్స్, డైలాగ్స్ బాగా పేలాయి.చాలావరకు ఈ షోలను సుధీర్, రష్మీ ల కోసం చూస్తూ ఉంటారు అభిమానులు.ఇదిలా ఉంటే తాజాగా ఇద్దరి మధ్య మరో సన్నివేశం తెగ వైరల్ గా మారింది.ఏకంగా సుధీర్ రొమాన్స్ లకు రష్మీ షాక్ అయింది.

Telugu Rashmi, Sudheer, Telugu, Tollwood-Movie

హోలీ పండుగ సందర్భంగా స్టార్ మా ఈ హోలీకి తగ్గేదేలే అనే ఈవెంట్ ను నిర్వహించింది.ఇందులో బుల్లితెర సెలబ్రెటీలు పాల్గొని బాగా సందడి చేశారు.ఇక మధ్యలో రష్మీ, సుధీర్ ల రొమాన్స్ మాత్రం బాగా ఆకట్టుకుంది.ఇక రష్మీ పై సుధీర్ రొమాంటిక్ కామెంట్స్ చేశాడు.పైగా ఆమె కోసం ఒక అందమైన ప్రేమ పాటను కూడా పాడి బాగా ఫిదా చేశాడు.

ఇక రవి అడిగిన విషయాలకు సరదాగా సమాధానం చెప్పాడు సుధీర్.

ఇక రష్మీ సుధీర్ కి ఏమి ఇవ్వాలి అనుకుంటుందో అని రవి అడగటంతో.రష్మీ కాలర్ పట్టుకొని ఆడదామా అని సుధీర్ తో అన్నది.

ఇక సుధీర్ రెడీ లైట్స్ ఆఫ్ అనడంతో రష్మీ షాక్ అవుతూ లైట్స్ ఆఫ్ చేసి హోలీ ఆడతారా అని కౌంటర్ వేసింది.ఇక సుధీర్ కూడా రొమాంటిక్ గా కొన్ని డైలాగులు కొట్టి బాగా హైలెట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube