మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రాయలసీమను తెలంగాణలో కలపాలని కోరారు.
అప్పుడే సీమలో సాగునీటి సమస్య తీరుతుందని తెలిపారు.
రాయలసీమను కలుపుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రాలను విడగొట్టడం కష్టమన్న ఆయన కలపడం సులభం అని తెలిపారు.తమ వాళ్లు ప్రత్యేక రాయలసీమ అంటున్నారన్న జేసీ దివాకర్ రెడ్డి వస్తే మంచిదేనని పేర్కొన్నారు.
అదేవిధంగా రాయలసీమను కలుపుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు ఉందని వెల్లడించారు.రాయల తెలంగాణ కావడానికి ఎవరికీ అభ్యంతరం లేదని వెల్లడించారు.
నాయకులు అందరినీ సమీకరిస్తున్నట్లు తెలిపిన జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల తర్వాత నేతలు అందరినీ కలుస్తానని స్పష్టం చేశారు.