రవీనా టాండన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ఆయనే కారణమా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రవీనా టాండన్( Raveena Tandon ) ఒకరు.తన నటనతో, అందంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది.1972 అక్టోబర్ 26వ తేదీన మహారాష్ట్రలోని ముంబైలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రవి టాండన్ , వీణా టాండన్ దంపతులకు జన్మించిన ఈమె 1991 వ సంవత్సరంలో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Raviraja Pinishetty Introduced Raveena Random In Tollywood Industry , Raveen Ta-TeluguStop.com
Telugu Balakrishna, Bangaru Bullodu, Bollywood, Raveen Tandon, Raviraja, Tollywo

ఇక నేడు రవీనా టాండన్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున ఈమెకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈమె పుట్టినరోజు కావడంతో తనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చారు తెలుగులో ఈమె బంగారు బుల్లోడు ( Bangaru Bullodu ) సినిమాలో నటించే అవకాశాన్ని అందుకొని తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

Telugu Balakrishna, Bangaru Bullodu, Bollywood, Raveen Tandon, Raviraja, Tollywo

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు తెలుగులో బంగారు బుల్లోడు సినిమాలో అవకాశం కల్పించి రవిరాజా పినీశెట్టి( Ravi Raja pinishetty ) ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఇలా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక తాజాగా ప్రశాంత్ నీల్ దశకత్వంలో కన్నడ స్టార్ యష్ నటించిన కే జి ఎఫ్ (KGF) సినిమా ద్వారా ఈమె పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

నటనపరంగా ఎన్నో అవార్డులను అందుకున్నటువంటి రవీనా 2023లో పద్మశ్రీ అవార్డును కూడా సొంతం చేసుకుంది.ఈమె రాష్ట్రపతి భవన్ లో 2023 ఏప్రిల్ 5న ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube