పూజారిని తన సీటులో కూర్చోబెట్టి సత్కరించిన ఐఏఎస్... ఏకిపారేస్తున్న నెటిజనం...

ఢిల్లీకి చెందిన ఓ ఐఏఎస్ అధికారి( IAS Officer ) తన కుర్చీలో ఓ పూజారిని కూర్చోబెట్టారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

 Viral Video Delhi Ias Officer Offers His Chair To Priest Details, Ias Officer, S-TeluguStop.com

ఐఏఎస్ అధికారి పేరు లక్షయ్ సింఘాల్.( IAS Lakshay Singhal ) నైరుతి ఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

వీడియోలో ఆయన తన ఆఫీసులో పూజారిని శాలువాతో సత్కరించి నమస్కరిస్తూ కనిపించారు.పూజారి అధికారి కుర్చీలో కూర్చున్నాడు, సింఘాల్ అతని పక్కనే నిల్చున్నారు.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.చాలా మంది వినియోగదారులను సింఘాల్ ను ఏకిపారేస్తున్నారు.ఐఏఎస్ అధికారి ఇలా పూజారి( Priest ) మాటలు నమ్మడం, అతడిని ఆఫీస్ కు తీసుకువచ్చి మరీ సన్మానించడం వింతగా ఉందని మరి కొందరు అంటున్నారు.ఈ ఐఏఎస్ అధికారి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, తన పదవి గౌరవానికి భంగం కలిగించారని వారు ఆరోపించారు.

ప్రభుత్వం కూడా ఈ ఘటనపై దృష్టి సారించింది.భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తన పునరావృతం కాకుండా సింఘాల్‌ను హెచ్చరించింది.సింఘాల్ తన చర్యకు క్షమాపణలు చెప్పారు.తన కార్యాలయాన్ని అగౌరవపరిచే ఉద్దేశం లేదని, తనకు చిన్నప్పటి నుంచి పూజారి గురువని, కృతజ్ఞతలు తెలిపేందుకు ఆహ్వానించానని తెలిపారు.

కాలేజీలో ఉన్నప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్( UPSC Civil Services ) పరీక్షకు ప్రిపేర్ అయ్యేలా ప్రేరేపించింది పూజారి అని అన్నారు.తన చర్య కేవలం గౌరవానికి సంకేతమని, తన అధికారిక విధులకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.భవిష్యత్‌లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామన్నారు.సింఘాల్ 2019 బ్యాచ్ IAS అధికారి.AGMUT క్యాడర్‌కు చెందినవారు.ప్రస్తుతం నైరుతి ఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్‌గా( DM South West Delhi ) పనిచేస్తున్నారు.

Delhi IAS officer offers his chair to Priest

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube