తెలుగు బుల్లితెరపై గ్లామర్ యాంకర్స్ ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు రష్మీ గౌతమ్( Rashmi Gautam ) బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా దూసుకుపోతోన్న రష్మీ గౌతమ్.హీరోయిన్‌గానూ పలు చిత్రాలను చేసింది… ముఖ్యంగా చిరంజీవి( Chiranjeevi ) హీరోగా చేస్తోన్న భోళా శంకర్( Bhola Shankar ) లో ఆమె ముఖ్య పాత్రను చేస్తోంది.
గతంలో కేవలం ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోకు మాత్రమే హోస్టుగా చేసిన రష్మీ గౌతమ్.సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంతో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ షో( Sridevi Drama Company Show )ను కూడా నడుపుతోంది.
ఇందులో తనదైన కామెడీతో పాటు గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.అలాగే, ఎన్నో స్పెషల్ ఈవెంట్లకి కూడా ఆమె హోస్ట్ చేస్తోంది.
అలాగే, వేరే ఛానెళ్లలోనూ సందడి చేసేస్తోంది.
ఇక ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.ఇందులో ప్రముఖ నటులు బ్రహ్మాజీ, రవిబాబులు( Brahmaji and Ravi Babu ) గెస్టులుగా ఎంట్రీ ఇచ్చారు.వీళ్లిద్దరూ రష్మీతో కలిసి తెగ సందడి చేశారు.
ఆ తర్వాత ఇంద్రజపై పంచులు వేయడం, బుల్లెట్ భాస్కర్ షర్ట్ విప్పడం చూపించారు.రవిబాబు పోలీస్ లా ఎంట్రీ ఇచ్చాడు .షోలోని వాళ్లందరూ కంప్లైట్ చేసుకోవాలని చెప్పారు.దీంతో ప్రతి ఒక్కరూ ఫన్నీగా కొందరిపై ఫిర్యాదు చేశారు.
ఆ సమయంలోనే బ్రహ్మాజీ దొంగతనం చేశాడని ఇంద్రజ ఆరోపించగా.అతడు తనదైన కామెడీతో నవ్వించాడు.
ఆ తర్వాత బ్రహ్మాజీ స్టేజ్ పైన ఉన్న రవిబాబు దగ్గరకు రష్మీని చేయి పట్టుకుని లాక్కొచ్చి ఈవిడ మాట్లాడుతుంటే నా తెలుగు పోతుంది సార్ అని కంప్లైట్ చేశాడు.ఆ తర్వాత మళ్లీ తీసుకొచ్చి రష్మీ మేకప్ పోయింది సార్ అని ఫిర్యాదు చేశాడు.ఇలా పలుమార్లు రష్మీని హైలైట్ చేస్తూ బ్రహ్మాజీ పంచులు వేశాడు.ఆయన దెబ్బకు రష్మీ షాకై అలానే చూస్తూ ఉండిపోయింది .మొత్తంగా ఇద్దరి కామెడీ హైలైట్ గా నిలిచింది…ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇటీవలే సుడిగాలి సుధీర్ సందడి చేశాడు ఆయన కంటిన్యూ అవుతారని అనుకున్న ఒక్క ఎపిపోడ్ కె పరిమితమయ్యాడు దీనితో రష్మినే షోని నడిపిస్తుంది…సుధీర్ సినిమాల్లో బిజీగా ఉంది షో చేయలేకపోతున్నాడు…
.