పోస్టర్‌ లు, ప్రకటనలకే రానా, తేజ పరిమితం అవుతున్నారా?

రానా హీరో గా తేజ( Teja ) దర్శకత్వం లో నేనే రాజు నేనే మంత్రి సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రాక్షస రాజు అనే సినిమా రాబోతుంది అంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

 Rana And Teja Movie Rakshasa Raja Posters ,teja, Rakshasa Raja, Poster, Rana-TeluguStop.com

అయితే ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్డేట్‌ లేదు.అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అలాంటి అనుమానాలు వచ్చిన ప్రతి సారి కూడా సినిమా ఉంది అంటూ ఒక పోస్టర్ లేదా ప్రకటన విడుదల చేస్తూ వస్తున్నారు.

తాజాగా మరోసారి తేజ ఈ సినిమా కు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ ను విడుదల చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.ప్రస్తుతం రాక్షస రాజు సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోంది అంటూ మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని మరోసారి యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

తేజ దర్శకత్వం లో వచ్చిన అహింస సినిమా హిట్ అయ్యి ఉంటే కచ్చితంగా ఇప్పటికే సినిమా ప్రారంభం అయ్యి ఉండేది.కానీ ఆ సినిమా నిరాశ పరచడంతో రాక్షస రాజు సినిమా విషయం లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అయితే తాజాగా విడుదల అయిన పోస్టర్ తో సినిమా ఉంటుంది అన్నట్లుగా చాలా మందికి నమ్మకం కలుగుతోంది.

రాక్షస రాజు(Rakshasa Raja ) అనే సినిమా లో రానా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది అంటూ మొదటి నుంచి చెబుతున్నారు.సినిమా పై అంచనాలు పెంచే విధంగా రానా మరియు తేజ ల ప్రకటనలు ఉంటాయి.కానీ సినిమా మొదలు అయ్యేది ఎప్పుడు అంటూ రానా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రానా హీరో గా మరో రెండు సినిమా లు కూడా రూపొందబోతున్నాయి.వాటి తో పాటు ఈ సినిమా ఉంటుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube